Hari Hara Veeramallu : ఎన్నో అడ్డంకులను ఎదురుకొని భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం నిన్నటి ప్రీమియర్ షోస్ నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రీమియర్స్ గ్రాస్ విషయం లో ఇండియా లోనే ఆల్ టైం రికార్డు ని నెలకొల్పారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నిన్న నైజాం ప్రాంతం లో అయితే 9 గంటలకు ప్రీమియర్ షో అనగా, సాయంత్రం 7 గంటల నుండి మల్టీప్లెక్స్ షోస్ బుకింగ్స్ ని ప్రారంభించడం మొదలు పెట్టారు. టికెట్స్ నిమిషాల వ్యవధి లోనే హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. సినిమా కచ్చితంగా బాగుంటుంది అనే ఆశతోనే లోపలకు అడుగుపెట్టారు. పాపం తిరిగి వచ్చేటప్పుడు అభిమానుల ముఖం పై నెత్తురు చుక్క కూడా లేకపోవడం శోచనీయం.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సెకండ్ హాఫ్ ఔట్పుట్ బాగాలేదని బయ్యర్స్ కి మొదటి నుండే ఒక సమాచారం ఉందట. అందుకే నిర్మాత AM రత్నం అడిగినంత డబ్బులు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ కారణం చేతనే బిజినెస్ చివరికి చాలా తక్కువకు జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కు కలిపి 107 కోట్ల రూపాయిల బిజినెస్ అంటే చాలా తక్కువ. ఎందుకంటే రెండు నెలల్లో విడుదల కాబోయే ‘ఓజీ’ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 180 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. ‘హరి హర వీరమల్లు’ కి ప్రపంచవ్యాప్తంగా కలిపి కూడా 120 కోట్ల బిజినెస్ జరగలేదు. అక్కడే అందరికీ అర్థం అయిపోయింది, ఈ చిత్రం విషయం లో ఎక్కడో ఎదో తేడా జరిగింది అని. కానీ ట్రైలర్ ఒక మోస్తారు గా ఉండడం తో సినిమా మినిమం గ్యారంటీ రేంజ్ లో ఉంటుందని అనుకున్నారు.
కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ సన్నివేశాలు చూసి అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయినా మొదటి వీకెండ్ వరకు అద్భుతమైన వసూళ్లు రాబడుతూ ఉంటాయి. ‘హరి హర వీరమల్లు’ కూడా ఆ కోవకే చెందుతుందని అభిమానులు ఆశిస్తున్నారు కానీ, రేపటి అడ్వాన్స్ బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. అంటే సినిమాకు బయట ఆశించిన స్థాయిలో పబ్లిక్ టాక్ లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. కానీ రేపు వర్కింగ్ డే కాబట్టి, డైరెక్ట్ గా కౌంటర్ బుకింగ్స్ ఉంటాయేమో చూడాలి. నిర్మాత AM రత్నం అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకొని ఉన్నాడు. ఈ సినిమా వీకెండ్ వరకు ఆడితే కాస్త ఆయన సేఫ్ అవుతాడు.