Hari Hara Veeramallu Release issue : ‘హరి హర వీరమల్లు'(Hari Hara VeeraMallu) చిత్రాన్ని ఆపేందుకు ఇండస్ట్రీ కి చెందిన నలుగురు పెద్దలు కావాలని టార్గెట్ చేశారా?, పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) కి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం జరిగిందా?, ఆయన వద్దనే సహాయం అందుకొని చివరికి ఆయన్నే ముంచాలని చూసారా?, జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అదే నిజం అని అనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే నలుగురు నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ తో కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని నడపాలి అనే డిమాండ్ పై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మా డిమాండ్స్ కి ఒప్పుకోకుంటే జూన్ 1 నుండి థియేటర్స్ బంద్ చేస్తాము అంటూ హెచ్చరించారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ బంద్ ని రద్దు చేసుకున్నారు.
అయితే గత ఏడాది సెప్టెంబర్ నుండి సంక్రాంతి వరకు నాలుగు సినిమాలు విడుదలై భారీ వసూళ్లను రాబట్టాయి. అప్పుడు రాని ఈ డిమాండ్ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయం లో రావడం వెనుక ఒక ప్రముఖ నిర్మాత హస్తం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త. ఇది కేవలం రూమర్ అని అంతా అనుకున్నారు, కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ వరకు ఈ విషయం వెళ్లి, ఆయన విచారణకు ఆదేశాలు జారీ చేసే స్థాయికి వెళ్లిందంటే కచ్చితంగా ఎదో ఇండస్ట్రీ లో ఎదో జరుగుతుంది అనే దాని అర్థం. కందుల దుర్గేష్ అధికార యంత్రాంగం కి ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేసాడు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసాడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్(Kandula Durgesh). హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి కాబట్టి, ఇందులో వాస్తవాలేంటో తెలుసుకోవాలని దుర్గేష్ అధికారులను ఆదేశించాడు.
Also Read : మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?
సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారు హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కుమార్ విశ్వజిత్. అయితే సోషల్ మీడియా లో ఈ అంశం పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఇది దిల్ రాజు, లేదా అల్లు అరవింద్ పనే అయ్యి ఉంటుందని మండిపడుతున్నారు. సురేష్ బాబు కూడా అందులో భాగం అవుతాడని ఊహించలేదంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటో, అసలు ఎవరు కుట్రకు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది.
23-05-2025
అమరావతిజూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్.…
— JanaSena Party (@JanaSenaParty) May 23, 2025