Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veera Mallu) చిత్రం వచ్చే నెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు నేటి నుండి గ్రాండ్ గా మొదలు కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు ఒక భారీ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. ఒక విధంగా చెప్పాలంటే ఇది మినీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఉంటుందట. ఈ ప్రెస్ మీట్ లో సినిమా గురించి అనేక విశేషాలు చెప్పడంతో పాటు, రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రొమోషన్స్ ని చేయబోతున్నాము అనేది కూడా చెప్పబోతున్నారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ తప్ప, మూవీ యూనిట్ మొత్తం పాల్గొనబోతుంది. నేడు ఉదయం 11 గంటల 55 నిమిషాలకు ఈ సినిమా నుండి ‘అసుర హననం’ అనే పాట విడుదల కానుంది.
Also Read : ప్రళయకాల రుద్రుడి అసుర హననం’..హరి హర వీరమల్లు మూడవ పాట వచ్చేస్తుంది!
ఈ పాట పై విడుదలకు ముందు నుండే భారీ హైప్ ఏర్పడింది. ఆ హైప్ ని ఈ పాట మ్యాచ్ చేయబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా హిందీ ప్రొమోషన్స్ కూడా భారీ లెవెల్ లో ప్లానింగ్ చేశారట. ముంబై లో ఏర్పాటు చేసిన ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడని, ఆయనతో పాటు ఒక ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ కూడా పాల్గొంటాడని టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి బాలీవుడ్ స్టార్స్ తో పెద్దగా కనెక్షన్ లేదు. ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కి, అబ్బాయి రామ్ చరణ్ కి బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నుండి ఖాన్స్ వరకు అందరూ మంచి స్నేహితులే. రామ్ చరణ్ తో అయితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇలా ప్రతీ ఒక్కరు క్లోజ్ గా ఉంటారు.
కానీ పవన్ కళ్యాణ్ తెలుగు నటీనటులతోనే పెద్దగా కలవడు, ఇక బాలీవుడ్ నటీనటులతో ఎక్కడ కలుస్తాడు. పవన్ కళ్యాణ్ కి బాలీవుడ్ నటులతో పరిచయం లేకపోయినా, నిర్మాత AM రత్నం కి మాత్రం బాలీవుడ్ లో అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. ఎంతో మంది స్టార్స్ తో అక్కడ ఆయన సినిమాలు చేసాడు. ఆ చనువుతో పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టమైన అమితాబ్ బచ్చన్(Amitab Bachhan) ని ఒక ఈవెంట్ కి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా నేడు ప్రెస్ మీట్ లో నిర్మాత AM రత్నం తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి ఫ్యామిలీ తో అమితాబ్ బచ్చన్ కి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. రెండు మూడు సార్లు అమితాబ్ పవన్ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. త్వరలోనే ఆయన ముంబై లో ఓజీ మూవీ షూటింగ్ కోసం ఒక పది రోజుల పాటు అక్కడే ఉండనున్నాడు. ఆ సమయంలో ఆయన అమితాబ్ బచ్చన్ ని స్వయంగా కలిసి ఈవెంట్ కి రావాల్సిందిగా ఆహ్వానిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం.
Also Read : హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఖరారు..ఎవరో ఊహించగలరా?