Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ షూటింగ్ ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా ముగిసింది అనేది అందరికీ తెలిసిందే. సైలెంట్ గా 2020 వ సంవత్సరం లో ఇద్దరు ముగ్గురు అతిథులతో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలను మొదలు పెట్టారు. డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) ఈ చిత్రాన్ని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లాలని ఎంతో ఆశతో ప్రయాణం మొదలు పెట్టారు. ఆరంభం లో షూటింగ్ జెట్ స్పీడ్ లో జరిగింది. ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు, కానీ అప్పుడే ఈ చిత్రం నుండి మొదటి గ్లింప్స్ వీడియో ని విడుదల చేసి అందరినీ షాక్ కి గురి చేసాడు డైరెక్టర్ క్రిష్. అసలు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ఇలాంటి గెటప్ వేయించాలని ఆలోచన రావడమే ఒక ప్రయోగం అంటే, ఆయన చేత ఆ రేంజ్ ఫైట్స్ చేయించి అభిమానులను సర్ప్రైజ్ కి గురి చేసాడు.
అలా మొదలైన డైరెక్టర్ క్రిష్ ‘హరి హర వీరమల్లు’ ప్రయాణం కొంతకాలం వరకు సాఫీగా సాగిపోయింది. కానీ మధ్య లో కరోనా రావడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం 11 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే అందుకున్నాడు. ఎందుకంటే నిర్మాత AM రత్నం తనకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనపై ఎలాంటి ఒత్తిడి చేయడం ఇష్టం లేక తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ కి లాక్ డౌన్ తర్వాత డబ్బుల కొరత వచ్చింది. ఆ సమయంలో ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పక్కన పెట్టి ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ చిత్రాలను పూర్తి చేసాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వగానే ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మొదలు పెట్టి ఒక రెండు నెలల పాటు పని చేసాడు.
Also Read : బయ్యర్స్ ని భయపెట్టి పంపిస్తున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..ఇలా అయితే కష్టమే!
కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడం వల్ల సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చాడు. ఈ క్రమంలో క్రిష్ ఇంకా ఈ చిత్రం కోసం తన సమయాన్ని కేటాయించలేక, తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా నుండి తప్పుకొని ఆయన అనుష్క ‘ఘాటీ’ చిత్రానికి షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయ్యినప్పుడు కూడా అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కి ‘హరి హర వీరమల్లు’ టీం తరుపున వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ‘హరి హర వీరమల్లు’ కి తనకు ఏ సంబంధం లేదు అనే విధంగానే ప్రవర్తిస్తున్నాడు. నేడు జరగబోయే ప్రెస్ మీట్ కి ఆయన రావడం లేదు. భవిష్యత్తులో జరగబోయే ఇంటర్వ్యూస్ కి కానీ, ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ కి కూడా ఆయన రావడం లేదు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే వచ్చే అవకాశం ఉంది, అది కూడా అనుమానమే. తన డ్రీం ప్రాజెక్ట్ కి క్రిష్ ఇంత దూరం జరిగిపోవడానికి కారణం నిర్మాతతో ఆయనకు ఏర్పడిన గొడవలే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.