Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ ప్రొమోషన్స్ ప్లాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో డిజైన్ చేసాడు ఆ చిత్ర నిర్మాత AM రత్నం. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు ప్రతీ రోజు ఒక షాకింగ్ సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా చేశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంకా అలాంటివి రెండు గ్రాండ్ ఈవెంట్స్ చేయబోతున్నామని నిర్మాత AM రత్నం ఆ ప్రెస్ మీట్ లో తెలిపాడు. అందులో ఒకటి మెయిన్ గా చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాగా, మరొకటి ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి లో వేలాది మంది అభిమానుల సమక్ష్యం లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ బీహార్ లో ఏ రేంజ్ లో జరిపించారో గుర్తుంది కదా?, అంతకు రెండింతలు ఎక్కువ ఉండేలా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట.
Also Read : నివ్వెరపోయేలా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో..చార్మినార్ ని ఎలా కట్టారో చూడండి!
అంతే కాదు ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రాబోతున్నది మరెవరో కాదు,ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). పవన్ కళ్యాణ్ కి రాజకీయ నాయకుడిగా సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో, నార్త్ ఇండియా మొత్తం మీద యోగి కి అలాంటి క్రేజ్ ఉంది. నార్త్ ఇండియా లో కూడా పవన్ కళ్యాణ్ ని అందరు యోగి ఆదిత్య నాథ్ తో పోల్చి చూస్తారు. అంతటి పవర్ ఫుల్ లీడర్స్ గా భావించే వీళ్లిద్దరు కలిసి ఒకే వేదిక పై కనిపిస్తే కచ్చితంగా దేశమంతా మాట్లాడుకుంటుంది. నార్త్ ఇండియా లో సినిమాకు బోలెడంత పబ్లిసిటీ దొరుకుతుంది. సినిమా కి సంబంధించిన ట్రైలర్ హిట్ అయితే ఇక అక్కడి ఆడియన్స్ క్యూ కట్టడానికి ఈ మాత్రం చాలు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల మొదటి వారం తిరుపతి లో అంగరంగ వైభవంగా జరిపించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పవన్ కళ్యాణ్ తిరుపతి లో ఎన్నో రాజకీయ సభలు పెట్టాడు కానీ, సినిమా ఈవెంట్స్ ని మాత్రం పెట్టలేదు. ఇదే ఆయనకు సీమలో మొట్టమొదటి సినిమా సభ. ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా రెస్పాన్స్ భీభత్సంగా వస్తుంది కానీ, సీమలోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చే రెస్పాన్స్ మాత్రం ఎవ్వరూ ఊహించలేరు, ఆ రేంజ్ లో ఉంటుంది. నేషనల్ మీడియా వరకు ఆ ప్రకంపనలు కనిపిస్తాయి. ఈసారి జరగబోయే తిరుపతి సభ పవన్ అభిమానులు దశాబ్ద కాలం గుర్తు పెట్టుకునేలా ఉంటుందని అంటున్నారు మేకర్స్. చూడాలి మరి ఆ రేంజ్ లో నిజంగా ఉంటుందా లేదా అనేది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ని ఈ నెల 27న విడుదల చేయబోతున్నారు మేకర్స్.
Also Read : బయ్యర్స్ ని భయపెట్టి పంపిస్తున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..ఇలా అయితే కష్టమే!