Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా గురించి అభిమానులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఫ్యాన్స్ దీని గురించే చర్చ. కొంతమంది అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు కూడా. కారణం ఈ సినిమా మే9 న కూడా విడుదల కావడం లేదు అనే. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉండుంటే ఈ వారం లో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యుండేది. మే9 న విడుదల అయ్యుండేడి. కానీ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) కి సింగపూర్ లో అగ్నిప్రమాదం జరిగి గాయాలు అవ్వడం, పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడికి వెళ్లి రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇండియా కి తిరిగి వచ్చేసిన తర్వాత వెంటనే షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ విపరీతమైన వెన్ను నొప్పి తో బాదడపడడం వల్ల డేట్స్ కేటాయించలేకపోయాడు.
Also Read : మే9 కూడా పోయినట్టే..దిక్కుతోచని స్థితిలో ‘హరి హర వీరమల్లు’ నిర్మాత!
దీంతో ఈ చిత్రం అనధికారికంగా మే 9 నుండి తప్పుకున్నది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. రేపు లేదా ఎల్లుండిలోపు మూవీ టీం కూడా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ కాదు, VFX షాట్స్ కూడా ఇంకా డెలివరీ అవ్వలేదట. ఈ సినిమా VFX కోసం చాలా కంపెనీలు పనిచేస్తున్నాయి. కేవలం రెండు కంపెనీల నుండి మాత్రమే ఇప్పటి వరకు VFX షాట్స్ డెలివరీ అయ్యాయి అట. అది కూడా ఈ సినిమా వాయిదా పడేందుకు ఒక కారణం అని అంటున్నారు. కేవలం ‘హరి హర వీరమల్లు’ సినిమాకు మాత్రమే కాదు, ఈమధ్య కాలం లో పెద్ద సినిమాలన్నిటికీ ఈ VFX షాట్స్ నిర్దిష్ట సమయంలో డెలివరీ అవ్వకపోవడం వల్ల ఇబ్బందులను ఎదురుకుంటున్నారు నిర్మాతలు.
ఇక ‘హరి హర వీరమల్లు’ నిర్మాత AM రత్నం పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఏది కావాలని చేసినది కాదు కానీ, ఆయన ఈ సినిమాని మొదలు పెట్టిన ముహూర్తం సరిలేదు అనుకుంటా. కానీ అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు నిద్రపోని మనస్తత్వం ఉన్న వ్యక్తి AM రత్నం. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అంటే కేవలం ఒక్క సన్నివేశం మాత్రమే అన్నమాట. ఆ సన్నివేశాన్ని తొలగించి సినిమాని విడుదల చేయొచ్చు. కానీ రత్నం మాత్రం తగ్గడం లేదు. కచ్చితంగా ఉండాల్సిందే అంటూ పట్టుబట్టడం వల్లే ఇప్పుడు ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తుంది. పరిస్థితులు కలిసి రాకపోవడం వల్ల ఆయన చాలా డిప్రషన్ కి గురైనట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కాస్త కనికరించి ఈ నెలలో ఆయన డేట్స్ ఇచ్చి సినిమాని పూర్తి చేస్తే, కనీసం జూన్ నెలలో అయినా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
Also Read : హరి హర వీరమల్లు’ టీం కి ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ సంస్థ!