https://oktelugu.com/

Hari Hara Veeramallu  : 5 నిమిషాల సన్నివేశం కోసం ‘హరి హర వీరమల్లు’ వాయిదా…? అభిమానుల సహనానికి పవన్ కళ్యాణ్ పరీక్ష!

కరోనా లాక్ డౌన్ అయిపోయాక ఒక పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీ ని పూర్తి చేయడం పై ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఒక 40 రోజుల పాటు 'హరి హర వీరమల్లు' షూటింగ్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

Written By: , Updated On : February 17, 2025 / 09:10 PM IST
Hari Hara Veeramallu

Hari Hara Veeramallu

Follow us on

Hari Hara Veeramallu  : షూటింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉంటూ, విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎన్నో ఏళ్ళ నుండి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2020 వ సంవత్సరం లో మొదలైన ఈ సినిమాకి టాలీవుడ్ పోలవరం ప్రాజెక్ట్ అని ఒక పేరు కూడా ఉంది. అప్పట్లో కరోనా కారణంగా చాలా కాలం వరకు షూటింగ్ ఆపేసారు. కరోనా లాక్ డౌన్ అయిపోయాక ఒక పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ ని పూర్తి చేయడం పై ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఒక 40 రోజుల పాటు ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎన్నికలు ముగిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఒక నాలుగు నెలలు గ్యాప్ తీసుకొని సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ని మళ్ళీ మొదలుపెట్టాడు. కొంతకాలం షూటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చాడు. మార్చి 28 న ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో విడుదల చేయాలనే పట్టుదల తో ఉన్నారు మేకర్స్. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఫస్ట్ హాఫ్ కి సంబంధించి రీ రికార్డింగ్ తో సహా మూవీ రెడీ. కానీ కేవలం ఒక కీలక సన్నివేశం మాత్రమే బ్యాలన్స్ ఉంది. పవన్ కళ్యాణ్, సత్య రాజ్ మధ్య వచ్చే ఈ సన్నివేశం అత్యంత కీలకమైనదికి అట. పవన్ కళ్యాణ్ కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే చాలు, ఈ సన్నివేశంతో సినిమా మొత్తం పూర్తి అవుతుంది. కానీ ఆయన తీరు చూస్తుంటే ఇప్పట్లో డేట్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి 24 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు అవుతాయి.

సుమారుగా 15 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండనున్నాయి. డేట్స్ ఇస్తే మార్చి రెండవ వారం లోనే ఇవ్వాలి. మార్చి రెండవ వారం లో షూటింగ్ ని పూర్తి చేసి, 28 న సినిమాని విడుదల చేయగలరా అంటే అనుమానమే అని అంటున్నారు. అయితే మరికొంతమంది చెప్పేది ఏమిటంటే ఈ నెలాఖరు లోపు పవన్ కళ్యాణ్ షూటింగ్ ని పూర్తి చేస్తాడని, డేట్స్ ఇస్తానని నిర్మాతలతో చెప్పాడు కానీ, ఎప్పటి నుండి ఇస్తాడు అనేదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదని, ఎట్టి పరిస్థితిలోనూ ఈ నెలలోనే షూటింగ్ ని పూర్తి చేస్తాడని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ కూడా, శనివారం, ఆదివారం ఖాళీనే కాబట్టి, ఆ రెండు రోజుల్లో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చిత్రానికి మోక్షం పవన్ కళ్యాణ్ ఎప్పటికి కల్పిస్తాడో చూడాలి.