Hari Hara Veeramallu Part 2: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పిన ఈ సినిమా, రెగ్యులర్ షోస్ మాత్రం టాక్ ప్రభావం కారణంగా కనీస స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు కేవలం 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ కి చాలా తక్కువ ఓపెనింగ్ వసూళ్లు అనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ అర్థం అయిపోయింది. కానీ నిన్న సాయంత్రం ఈ సినిమా గురించి సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయడం, దానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరై మాట్లాడడం అందరినీ షాక్ కి గురి చేసింది.
Also Read: వార్ 2 ట్రైలర్ రివ్యూ: ఇద్దరు రూత్ లెస్ ఏజెంట్స్ తలపడితే? బ్లాస్టింగ్ విజువల్స్!
పైగా నిన్న సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ తో సహా, దర్శకుడు జ్యోతి కృష్ణ, నిర్మాత AM రత్నం వంటి వారు కూడా సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇంత డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాకు సీక్వెల్ నా?, మేకర్స్ కి మతి ఉండే మాట్లాడుతున్నారా?, అసలు సినిమా పరిస్థితి ఏంటో వాళ్లకు తెలిసిందా లేదా?, టీవీ సీరియల్స్ లో ఉండే గ్రాఫిక్స్ కంటే దారుణంగా ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయి, పైగా ఫినిషింగ్ ఏమైనా ఆసక్తికరంగా ఇచ్చారా అంటే అది కూడా లేదు. తుఫాన్ గాలుల్లో ఔరంగజేబు, వీరమల్లు కొట్టుకుంటూ వచ్చి ఒక దగ్గర కలుస్తారు. అక్కడితో ఎండ్ కార్డు పడుతుంది. పార్ట్ 2 బ్యాటిల్ ఫీల్డ్ అంటూ. కానీ పార్ట్ 2 కి కావాల్సిన కథ ఎక్కడ ఉంది?.
Also Read: మహేష్ బాబు – చిరంజీవి కాంబోలో మిస్ అయిన మూడు సినిమాలు ఇవేనా..?
తన గురువుని ఔరంగజేబు తీసుకెళ్లాడని, తనని విడిపించుకొని రావాలనే ఉద్దేశ్యంతో వీరమల్లు ఔరంగజేబు వద్దకు వెళ్తాడు. ఇక ఆ తర్వాత అతనితో పోరాడి తన గురువుని, తన మనుషుల్ని తీసుకొచ్చేస్తాడు. అంతే, సినిమా అక్కడితో అయిపోయింది కదా?, ఇంకేమి స్టోరీ మిగిలి ఉంది. రియల్ లైఫ్ క్యారక్టర్ ని సినిమాలోకి తీసుకొచ్చి ఇష్టమొచ్చినట్టు వక్రీకరించి ఒక భాగం గా సినిమా తీయడమే తప్పు, ఇప్పుడు రెండవ భాగం కూడానా?, డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని డీల్ చేసి ఉండుంటే పద్దతి ఇలా ఉండేది కాదు, చాలా బాగుండేది, ఈ సినిమా కోసం ఆయన ఎంతో పరిశోధనలు చేసాడు. అలాంటి డైరెక్టర్ వెళ్ళిపోయినప్పుడే ఈ సినిమాని ఆపేసి ఉండుంటే చాలా బాగుండేది అనేది అభిమానుల అభిప్రాయం.