Hari Hara Veeramallu Review : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు కాసేపట్లో హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో గ్రాండ్ గా మొదలు కాబోతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అభిమానుల్లో, అదే విధంగా ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో బాగా పెరుగుతుంది అనే ఆశలో ఉన్నారు. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై చాలా రోజులైంది. కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జరగడం లేదు. చాలా నార్మల్ గా సాగుతుంది. ఈరోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మంచి క్రేజ్ ఏర్పడి టికెట్స్ భారీ గా అమ్ముడుపోతాయనే ఆశతో ఓవర్సీస్ బయ్యర్స్ ఎదురు చూస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ ని ఓవర్సీస్ లో కొంతమంది ప్రముఖులకు ప్రత్యేక స్క్రీనింగ్ ద్వారా చూపించారట. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ మామూలు రేంజ్ లో లేదని అంటున్నారు. అసలు ఈ సినిమా ఇంత బాగుంటుందని అసలు అనుకోలేదని, ఆలస్యం కాకపొయ్యుంటే ఈ సినిమాపై హైప్ మామూలు రేంజ్ లో ఉండేది కాదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో మూడు యాక్షన్ బ్లాక్స్ అదిరిపోయాయని, ఫ్యాన్స్ కి కచ్చితంగా విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని, అప్పట్లో ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఫస్ట్ హాఫ్ ని చూసి అభిమానులు ఎంతలా మురిసిపోయారో, ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ హాఫ్ ని చూసి అంతే మురిసిపోతారని, అంత అద్భుతంగా వచ్చిందని , ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బ్లాక్స్ ట్రెండ్ సెట్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు.
అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ ప్రారంభం లో కాస్త ల్యాగ్ స్క్రీన్ ప్లే ఉంటుందని, కానీ అది కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ జ్యోతి కృష్ణ చాలా చక్కగా తీర్చి దిద్దాడని,అభిమానులకు మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు కూడా అది నచ్చుతుందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమాని చూసి బయటకు వచ్చే ప్రతీ ఒక్కరు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోనే బయటకు వస్తారని, ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారి ఈ సినిమాకు కదిలితే లాంగ్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఎవ్వరూ ఊహించలేరని అంటున్నారు. ఇలా ఇప్పటి వరకు ‘హరి హర వీరమల్లు’ కంటెంట్ గురించి మొత్తం పాజిటివ్ రెస్పాన్స్ నే వచ్చింది. మరి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.