Hari Hara Veeramallu OTT: కంటెంట్ పరంగా , క్వాలిటీ పరంగా, VFX పరంగా ఈ ఏడాది అభిమానులను, ప్రేక్షకులను దారుణంగా నిరాశపర్చిన చిత్రాల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie). ఆరేళ్ళ నుండి సెట్స్ మీద మగ్గుతూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల చేస్తామని చాలా కబుర్లు చెప్పాడు కానీ, చివరికి ఆయనకు కేవలం తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయడానికే తల ప్రాణం తోకకి వచ్చింది. పాపం అభిమానులు అయితే ఈ సినిమా విడుదల అయ్యే వరకు కూడా ప్రతీ రోజు నరకం చూసేవారు. తీరా విడుదల అయ్యాక ఈ చిత్రం వారిని తీవ్రమైన నిరాశకు గురి చేసింది. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్ గా గ్రాండ్ ప్రీమియర్ షోస్ వేశారు.
Also Read: తెలుగు సినిమాల్లో ఒక్కప్పటి ఫార్ములాను మళ్ళీ వాడుతున్నారా..?
ఒక్కో ప్రీమియర్ షో టికెట్ 600 రూపాయిలు అయినప్పటికీ కూడా అభిమానులు ఎగబడి మరీ ఈ చిత్రాన్ని వీక్షించారు. కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రతనికే ఇండియా వైడ్ గా 17 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూల్లెకు వచ్చాయంటే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే అంత డబ్బు పెట్టి థియేటర్స్ కి వెళ్లిన అభిమానులకు సెకండ్ హాఫ్ క్వాలిటీ ని చూసి కళ్ళు బైర్లు కమ్మేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటికి గ్రాఫిక్స్ వర్క్ పూర్తి అయ్యినట్టు లేదు, మళ్ళీ సినిమాని వాయిదా వేస్తే అభిమానులు ఇంటికి వచ్చి కొడుతారు అనే భయం తో, సగం సగం పూర్తి అయిన పనులతోనే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఫలితంగా ప్రీమియర్ షోస్ నుండే దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ ప్రభావం రెగ్యులర్ షోస్ మీద చాలా బలంగా పడింది.
ఫలితంగా ఈ చిత్రం కేవలం 75 కోట్ల రూపాయిల షేర్ వద్దనే ఆగిపోయింది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నేడు అర్థ రాత్రి 12 గంటల నుండే అందుబాటులోకి రానుంది. అయితే ఈ చిత్రం విడుదలైన కొద్దిరోజుల తర్వాత మేకర్స్ సరికొత్త VFX కంటెంట్ తో చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రీమియర్ షోస్ లో అభిమానులకు చూపించిన VFX కంటెంట్ కంటే, ఇది వెయ్యి రేట్లు బెటర్ అనే విధంగా ఉంటుంది. ఈ వెర్షన్ నే నేడు ఓటీటీ లో కూడా విడుదల చేస్తారట. థియేటర్స్ లో ఆడియన్స్ నుండి దారుణమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, కనీసం ఓటీటీ లో అయిన పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.