Kiara Advani: యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ(Kiara Adavni). ఈమె తెలుగు లో చేసింది కేవలం మూడు సినిమాలే. అందులో ‘భరత్ అనే నేను’ చిత్రం ఒక్కటే కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) తో చేసిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ చిత్రాలుగా నిలిచాయి. ఈ ఏడాది అయితే ఈ క్రేజీ హీరోయిన్ ముట్టుకున్న ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భస్మం అయిపోయాయి. ఏడాది ప్రారంభం లో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) తో ఈమె మన ముందుకు వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి డిజాస్టర్ ఫ్లాప్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read: ఇన్ స్టాగ్రామ్ మొత్తాన్ని ఊపేస్తున్న నాగార్జున ‘సైమన్’ మేనియా..ఇదేమి క్రేజ్ బాబోయ్!
నిర్మాత దిల్ రాజు సుమారుగా ఈ చిత్రం కారణంగా 200 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది. ఈ సినిమా తర్వాత రీసెంట్ గానే ఈమె ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) లు నటించిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం లో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. తెలుగు లో అయితే మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ వద్ద ఇబ్బంది పడుతున్న ఈ సినిమా, హిందీ లో కూడా కలెక్షన్స్ బాగా డౌన్ అయిపోయాయి. ఇదంతా కియారా అద్వానీ పాదం సోకడం వల్లే అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరుస ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ఏ హీరోయిన్ కి అయిన ఇలాంటి ట్రోల్స్ ఎదురు అవ్వాల్సిందే. అయితే ‘వార్ 2’ చిత్రం కి ఏదైనా స్పెషల్ ఫ్యాక్టర్ ఉందా అంటే కియారా అద్వానీ నే.
ఇద్దరు హీరో స్క్రీన్ మీద ఫైటింగ్ చేసుకుంటున్న రానటువంటి కిక్,కియారా అద్వానీ బికినీ వేసుకున్న షాట్స్ కి వచ్చాయి అంటేనే అర్థం చేస్కోవచ్చు, ఆమె విలువ ఎలాంటిది అనేది. అందమైన అమ్మాయి, అందానికి తగ్గ టాలెంట్ కూడా బోలెడంత ఉంది, కానీ ఈమధ్య కాలం లో అదృష్టమే కలిసి రావడం లేదు. ఆమె లైనప్ లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్, కేజీఎఫ్ హీరో యాష్ నటించిన ‘టాక్సిక్’. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే యాష్ అభిమానులు కియారా అద్వానీ లేటెస్ట్ ట్రాక్ రికార్డు ని చూసి భయపడుతున్నారు. ఒక్క ఏడాది లో ఒక హీరోయిన్ నటించిన సినిమాలకు కలిపి 400 కోట్ల రూపాయిలు నష్టం రావడం అనేది సాధారణమైన విషయం కాదు, ఆ మాత్రం భయం ఉండడం లో తప్పు లేదులే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.