Hari Hara Veeramallu OTT Release: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన సినిమాల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఆరేళ్ళ నుండి సెట్స్ మీద ఉంటూ, 12 సార్లు విడుదల వాయిదా పడింది ఈ చిత్రం అభిమానుల సహనం తో విడుదలకు ముందు ఒక ఆట ఆడుకుంది. కేవలం ఈ ఒక్క ఏడాది లోనే ఈ చిత్రం నాలుగు సార్లు వాయిదా పడింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇన్ని సార్లు ఒక సినిమా వాయిదా పడితే జనాల్లో ఆసక్తి పోవడం సహజం. కానీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుండి వస్తున్న సినిమా కావడంతో పాటు, ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొనడం తో ప్రేక్షకులు ఈ సినిమాలో కచ్చితంగా ఎదో విషయం ఉంది అని నమ్మారు. అందుకే ఓపెనింగ్స్ భారీ గానే ఇచ్చారు, కానీ విడుదల తర్వాత సినిమాలో ఏమి లేదనే విషయం తెలుసుకొని నిరాశకు గురయ్యారు.
Also Read: ఎన్టీఆర్ ‘దేవర 2’ ఆగిపోవడం పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..ఇది మామూలు ట్విస్ట్ కాదు!
అభిమానులు నిరాశకు గురి అవ్వడానికి ప్రధాన కారణం సెకండ్ హాఫ్. డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో మంచి సన్నివేశాలను అయితే రాసుకున్నాడు కానీ, వాటిని సరైన టేకింగ్ తో తియ్యలేకపోయాడు. ముఖ్యంగా గ్రాఫిక్స్ అయితే అత్యంత నాసిరకంగా ఉండడాన్ని అభిమానులు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ సినిమా చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ కుంభస్థలం బద్దలు కొట్టేసాడంటూ అభిమానులు సంతోషపడ్డారు. కానీ సెకండ్ హాఫ్ లో అభిమానులు పిన్ డ్రాప్ సైలెన్స్ మైంటైన్ చేశారు, ఎందుకంటే ఈలలు కొట్టి చొక్కాలు చింపుకునే రేంజ్ సన్నివేశం ఒక్కటి కూడా లేదు కాబట్టి. అయితే విడుదలైన రెండు రోజులకు సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ చేత అత్యంత ట్రోలింగ్ కి గురి కాబడిన VFX సన్నివేశాలను తొలగించారు. క్లైమాక్స్ లో సినిమాని బాగా నెగిటివ్ చేసిన చివరి 7 నిమిషాలు కూడా రెండు రోజుల తర్వాత కత్తిరించారు.
Also Read: బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’కు ఎండ్ కార్డ్.. ఊహించని ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
కానీ నిన్న ఈ సినిమా ఓటీటీ లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో నిన్న అర్థరాత్రి 12 గంటల నుండి స్ట్రీమింగ్ కావడం మొదలైంది. ఈ ఓటీటీ వెర్షన్ లో చివరి 15 నిమిషాలు కత్తరించేసారు. చౌకీ తానా ఫైట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఔరంగజేబు మీదకు దండయాత్ర కి వెళ్తాడు. ఆ సమయం లో ఒక భారీ సునామీ వస్తుంది. ఈ సునామీ లో ఔరంగజేబు తనని తానూ కాపాడుకోవడానికి సైనికులను కవచం గా చేసుకుంటాడు. వాళ్లంతా ఆ వాయుగుండం లో కొట్టుకొని పోతారు. మరో పక్క వీరమల్లు ఆ వాయుగుండం లో తన తో పాటు వచ్చిన వాళ్ళను కాపాడుకుంటూ, తానే వాయుగుండం లో కొట్టుకొని పోతాడు. అలా ఆయన వాయుగుండం లో తేలుతున్న ఔరంగజేబు వద్దకు చేరుకొని, అతని చెయ్యి పట్టుకుంటాడు. అక్కడితో సినిమా ముగుస్తుంది. కానీ ఓటీటీ వెర్షన్ లో చౌకీ తానా ఫైట్ అయిపోయిన వెంటనే సినిమాకు శుభం కార్డు పడుతుంది.