Bigg Boss Agnipariksha Twist: టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటిని సంపాదించుకున్న రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు తొమ్మిదో సీజన్ ని సిద్ధం చేస్తున్నారు…ఇక ఇప్పటివరకు ఈ షోలో కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొన్నారు. ఇక సామాన్యులను కూడా ఇందులో భాగం చేయాలనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ఒక షో నిర్వహిస్తుంది. అందులో 45 మంది వ్యక్తులు పాల్గొన్నారు. అందులో నుంచి కేవలం ఐదుగురిని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరికైతే టాలెంట్ ఉందో ఎవరైతే టాస్క్ లను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేయగలుగుతారో వాళ్ళకు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ అగ్ని పరీక్ష కు సంబంధించిన షూట్ ఈనెల 19 వ తేదీ వరకు జరిగింది…ఈనెల 22వ తేదీ నుంచి హాట్ స్టార్ లో, స్టార్ మా లో టెలికాస్ట్ అవుతోంది. ఇక సెప్టెంబర్ 5 వ తేదీ వరకు వీళ్లను సపోర్ట్ చేస్తూ ప్రేక్షకులు ఓటింగ్ వేసే సౌకర్యాన్ని కూడా కలిగిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఎక్కువ ప్రేక్షకుల మన్ననలను పొందుతారో అలాగే టాస్క్ లను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేయగలుగుతారో వాళ్లకు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఉంటుంది…
Also Read: ‘వార్ 2’ కి వచ్చిన కలెక్షన్స్ లో మైనస్ షేర్స్..చరిత్రలో ఇదే తొలిసారి!
ఇక మొత్తానికైతే బిగ్ బాస్ లో సామాన్య మానవులు కూడా పాల్గొనవచ్చు అనే ఒక టాస్క్ నిర్వహించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ షో ద్వారా సామాన్యులకు కలిగే లాభాలు ఏంటి అంటూ గతంలో కొంతమంది ఈ షో మీద కొన్ని విమర్శలైతే చేశారు.
దాంతో షో యాజమాన్యం సైతం సామాన్యులను ఇందులో భాగం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది… ప్రేక్షకులు వాళ్ళను సపోర్ట్ చేస్తూ సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఓటింగ్ వేసే అవకాశం అయితే ఉంది… మొత్తానికైతే గత ఎనిమిది సీజన్లో బిగ్ బాస్ సాధించిన సక్సెస్ కంటే ఈ సీజన్లో మరింత సక్సెస్ ను అందుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సీజన్లో సామాన్యులను కూడా బాగానే చేస్తున్నారు.
Also Read: దేశాన్ని కుదిపేసింది.. మోడీ సైతం ప్రశంసించిన సినిమా ఏంటో తెలుసా..?
కాబట్టి ఎక్కువ సంఖ్యలో జనాలకు ఈ షో రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ షోకి హోస్టుగా నాగార్జున చేస్తున్నాడు. కాబట్టి ఈ షో మరింత ముందుకు వెళ్తే నాగార్జునకి కూడా చాలా మంచి గుర్తింపైతే వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…