Hari Hara Veeramallu : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా ఈ నెల 24 వ తేదీన విడుదల కాబోతున్న సందర్భంగా నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. మామూలుగా యూట్యూబ్ లో కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో అభిమానుల కోసం రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. ఈ ట్రైలర్ విడుదలకు ముందు వరకు కూడా అభిమానులు ఈ సినిమా ఇంత ఘనంగా ఉంటుందని ఊహించలేదు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ సినిమాలు చేయకపోయినా,రాజకీయాల్లో ఫుల్ బిజీ అయినా కూడా ఈ రేంజ్ సినిమా చేసాడంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
ఈ ట్రైలర్ లో డైలాగ్స్ మొత్తం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రాసాడట. ఆయన రాసిన డైలాగ్స్ అంటే కచ్చితంగా పొలిటికల్ కంటెంట్ లాగా ఉంటుందేమో, ఫ్యాన్స్ కి కూడా బోర్ కొట్టేస్తుందని అనుకున్నారు. కానీ డైలాగ్స్ చాలా షార్ట్ గా, క్రిస్పీ గా ఉన్నాయి. కానీ ఒక డైలాగ్ మాత్రం ఆయన మాజీ సీఎం జగన్ ని ఉద్దేశించి రాసినట్టుగా అనిపించింది. క్యారక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజ్ మాట్లాడుతూ ‘నువ్వు మా వెర్రి వీసన్న మామయ్య కదూ’ అని అంటాడు. జగన్ ని సోషల్ మీడియా లో కొంతమంది మావయ్య అంటూ ట్రోల్ చేస్తారు. దానినే ఇక్కడ ఉపయోగించినట్టుగా అనిపించింది. అదే విధంగా ‘చాలా మంది నేను రావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం నేను రాకూడదు అని కోరుకుంటున్నారు’ అని అంటాడు. ఇది కూడా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ లాగానే అనిపించింది.
Also Read: కూలీ మూవీ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన లోకేష్ కనకరాజ్…
ఇక ఈ ట్రైలర్ లోని VFX షాట్స్ కొన్ని అద్భుతంగా ఉన్నాయి, మరికొన్ని యావరేజ్ గా ఉన్నాయి. ట్రైలర్ మొత్తం వేరే లెవెల్ లో ఉంది అనుకునేలోపు, చివర్లో వచ్చే ‘ఆంది వచ్చేసింది’ డైలాగ్ దగ్గర వచ్చే VFX మాత్రం చాలా చీప్ గా అనిపించింది. చూస్తుంటే ఇది క్లైమాక్స్ అయిపోయాక వచ్చే క్లిప్ హ్యాంగర్ సన్నివేశానికి సంబంధించిన షాట్ అని అర్థం అవుతుంది. క్లిప్ హ్యాంగర్ సన్నివేశానికి సంబంధించిన VFX వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదట. కేవలం అభిమానుల కోసం ఉన్న రఫ్ కట్ ని జత చేసి విడుదల చేశారట. ఈ నెల 10 వ తేదీ లోపు కొత్త VFX కంటెంట్ వస్తుందని, చివర్లో మొత్తం మారుస్తారని అంటున్నారు.