HHVM Nizam rights:హరి హర వీరమల్లు ట్రైలర్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేయగా, నైజాం రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే హరి హర వీరుమళ్లు నైజాం రైట్స్ ఇంకా ఫైనల్ కాలేదు అంటూ ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది.
దర్శకుడు క్రిష్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా హరి హర వీరమల్లు చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ మూవీ మొదలై దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కారణం తెలియదు కానీ హరి హర వీరమల్లు చిత్రాన్ని పక్కన పెట్టి భీమ్లా నాయక్, బ్రో చిత్రాలు పూర్తి చేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) . ఈ లోగా 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. షూటింగ్స్ గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రచార సభల్లో విరివిగా పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టారు.
Also Read: కమల్ కి సక్సెస్ ఇచ్చిన లోకేష్ కనకరాజు.. రజినీని ఏం చేస్తాడో..?
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు(Harihara Veeramallu), ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయాల్సి ఉంది. హరి హర వీరమల్లు ఇప్పటికే ఆలస్యం కావడంతో మొదట ఆ చిత్రానికి డేట్స్ కేటాయించారు. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా జ్యోతి కృష్ణ తెరపైకి వచ్చారు. ఆయన ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. హరి హర వీరమల్లు డిలే అవుతూ వస్తున్న నేపథ్యంలో బజ్ క్రియేట్ కాలేదు. అయితే ట్రైలర్ విడుదల అనంతరం ఒక్కసారిగా సినారియో మారిపోయింది. ట్రైలర్ లో విజువల్స్ చూసిన ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ధరకు హరి హర వీరమల్లు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయంటూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అపోహలే అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నైజాం బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదట. హరి హర వీరమల్లు నైజాం రైట్స్ రూ. 60 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు కథనాలు వెలువడ్డాయి. అయితే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు రూ. 40 కోట్లు మాత్రమే ఆఫర్ చేశాయట. అనంతరం రిఫండబుల్ అమౌంట్ కింద రూ. 50-54 కోట్లు ఆఫర్ ఇచ్చారట. అందుకు నిర్మాతలు ఒప్పుకోలేదట. ఈ క్రమంలో డిమాండ్ తగ్గి రూ. 40-45 కోట్ల నాన్ రిఫండబుల్ ఒప్పందానికి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారట.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా… విజయ్ నామ సంవత్సరం స్టార్ట్ అవ్వనుందా..?
నిర్మాతలు మాత్రం రూ.55 కోట్ల నాన్ రిఫండబుల్ ఆఫర్ కి మొగ్గు చూపుతున్నారట. అందుకు మైత్రి, దిల్ రాజు వంటి బడా డిస్ట్రిబ్యూటర్స్ సిద్ధంగా లేని పక్షంలో ఓన్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నారని సమాచారం. హరి హర వీరమల్లు అవుట్ ఫుట్ మీద ధృడ విశ్వాసంతో ఉన్న ఏఎం రత్నం రిస్క్ కి సిద్దమయ్యాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ రీత్యా పాజిటివ్ టాక్ వస్తే.. కాసుల వర్షం కురుస్తుంది. మరి చూడాలి హరి హర వీరమల్లు ఏ స్థాయి విజయం సాధిస్తుందో..