https://oktelugu.com/

Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు’ నుండి బ్రాండ్ న్యూ పోస్టర్..పూనకాలతో ఊగిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్!

స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ మంచి ఊపు మీద ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం రీ ఎంట్రీ తర్వాత వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇది ఆయన అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టింది. సినిమాలు హిట్స్ అయినప్పటికీ కూడా అసంతృప్తి గానే ఉండేవారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 12, 2024 / 04:26 PM IST
    Follow us on

    Hari Hara Veeramallu : స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ మంచి ఊపు మీద ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం రీ ఎంట్రీ తర్వాత వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇది ఆయన అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టింది. సినిమాలు హిట్స్ అయినప్పటికీ కూడా అసంతృప్తి గానే ఉండేవారు. మరో లెవెల్ కి వెళ్లాల్సిన హీరో కేవలం తెలుగు కి మాత్రమే పరిమితం ఐపోయాడని బాధపడేవారు. అలాంటి సమయంలోనే ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలను ప్రకటించాడు. ఎప్పుడెప్పుడా అని ఈ సినిమాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూసేవారు. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి.

    కానీ ఈ రెండు సినిమాలు 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో గత కొద్ది రోజుల నుండి పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. మార్చి 28 వ తారీఖున తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన బ్రాండ్ న్యూ పోస్టర్ ని విజయ దశమి సందర్భంగా నేడు విడుదల చేసారు మేకర్స్. నుదిట వీర తిలకం దిద్ది, చేతిలో భగ భగ మండుతున్న మూడు బాణాలను ఒకేసారి ఎక్కుపెడుతూ వీరోచితంగా కనిపించిన పవన్ కళ్యాణ్ లుక్ ని చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇది కదా పవర్ స్టార్ నుండి మేము కోరుకున్నది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ తర్వాత నిర్మాతలు ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీని ప్రకటించారు. ఆ పోస్టర్ అనుకున్న రేంజ్ లో లేదు, సరైన పోస్టర్ కోసం అభిమానులు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. నేడు వాళ్ళు కోరుకున్న పోస్టర్ రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. నిమిషాల వ్యవధి లో వేల ట్వీట్స్ వేస్తూ నేషనల్ వైడ్ గా ‘హరి హర వీరమల్లు’ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.

    ఇటీవల కాలం లో రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. దీంతో ఈ లుక్ నార్త్ ఇండియా సినీ అభిమానులకు కూడా బాగా ఎక్కేసింది. అక్కడ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. సినిమాకి సంబంధించి సరైన థియేట్రికల్ ట్రైలర్ ని వదిలితే ఆకాశమే హద్దు అనే స్థాయిలో ఓపెనింగ్ వసూళ్లు వస్తాయని, నార్త్ ఇండియా లో కూడా మంచి ఓపెనింగ్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వారి అంచనాలను ఈ చిత్రం ఎంత వరకు అందుకుంటుందో చూడాలి. దీపావళి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి సాంగ్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.

    Tags