Hari Hara Veeramallu Movie : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మేనియా నే కనిపిస్తుంది. జూన్ 12 న ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవుతున్న సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ లో మునిగి తేలుతున్నారు అభిమానులు. ఎల్లుండి నిర్మాత AM రత్నం ఒక భారీ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదే ప్రెస్ మీట్ లో ఈ సినిమాకు సంబంధించిన మూడవ పాట ని విడుదల చేయబోతున్నారు. ఆ పాటకు సంబంధించిన అప్డేట్ కాసేపటి క్రితమే మూవీ టీం సోషల్ మీడియా ద్వారా ఇచ్చింది. ‘అసుర హననం’ పేరుతో మొదలయ్యే ఈ పాట వేరే లెవెల్ లో ఉంటుందని, అభిమానులు ఈ పాటని చూసిన తర్వాత షాక్ కి గురి అవుతారని, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈ రేంజ్ స్తంట్స్ చేయడం మీరు కలలో కూడా ఊహించి ఉండరని అంటున్నారు.
Also Read : ‘సింగిల్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ 2 ప్రాంతాల్లో ‘హిట్ 3’ అవుట్!
పాట అని చెప్తున్నాడు మళ్ళీ స్తంట్స్ అంటాడేంటి అని మీరు అనుకోవచ్చు. విషయం లోకి వెళ్తే ఇది ఒక ‘వార్ సాంగ్’ అట. యుద్ధం జరుగుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట అట ఇది. ఇప్పటి వరకు విడుదలైన ‘హరి హర వీరమల్లు’ కంటెంట్స్ అన్నిట్లో ఈ పాట ది బెస్ట్ గా ఉండబోతుందని సమాచారం. ఉదాహరణకు చెప్పాలంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం లోని ఇంటర్వెల్ ఫైట్ సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ‘వాడేవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డు ఎవరన్నా’ అంటూ సాగే ఒక మాస్ సాంగ్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ పాట తరహా లోనే ఇది కూడా ఉంటుంది. ‘అసుర హననం’ పాటకు లిరిక్స్ గోశాల రాంబాబు అందించాడు. ఈయన ‘భగీర’ చిత్రం లో ఒక అద్భుతమైన పాటకు లిరిక్స్ అందించాడు.
బలమైన పదజాలంతో ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లడం ఈయన స్పెషాలిటీ. సినిమాకు ఈ పాట హైలైట్ గా నిలుస్తుందట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు ‘హరి హర వీరమల్లు’ గురించి ట్వీట్స్ వేస్తున్నారు. గతం లో విడుదల చేసిన రెండు పాటలు తుస్సుమన్నాయి. ‘మాట వినాలి’ పాట అసలు హిట్ అవ్వలేదు కానీ , ‘కొల్లగొట్టినాదిరో’ పాట ఆరంభం లో మతాబు లాగా వెలిగి, ఆ తర్వాత వెంటనే ఆరిపోయింది. కనీసం ఎల్లుండి విడుదల చేయబోయే పాట అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి. అభిమానులు అయితే ఈ పాటపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 25 నుండి 28 లోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.