Hit 3 Movie : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit :The Third Case) ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని ఇప్పటికీ డీసెంట్ స్థాయి లో థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకోవడం ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. 18 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సీడెడ్ ప్రాంతం లో నష్టం తప్పేలా లేదు కానీ, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టింది. దసరా, సరిపోదా శనివారం తర్వాత నాని కి ఇది మూడవ వంద కోట్ల గ్రాస్ సినిమా అనుకోవచ్చు. పెరిగిన ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా ని చూసి, ఇక నుండి నాని మీడియం రేంజ్ హీరో కాదు, స్టార్ హీరో అని ట్రేడ్ విశ్లేషకులంతా చెప్పుకొచ్చారు. శనివారం రోజున 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఆదివారం రోజున 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
Also Read : ప్రళయకాల రుద్రుడి అసుర హననం’..హరి హర వీరమల్లు మూడవ పాట వచ్చేస్తుంది!
ఓవరాల్ గా 18 రోజులకు గానూ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 40 కోట్ల 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 18 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక దాదాపుగా ఈ ప్రాంతం లో క్లోజింగ్ వేసుకోవచ్చు. మహా అయితే ఇంకో పది లక్షల షేర్ కి మించి ఆ ప్రాంతం నుండి రావడం కష్టమే. అదే విధంగా సీడెడ్ లో ఈ చిత్రానికి 5 కోట్ల 7 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 5 కోట్ల 40 లక్షల రూపాయలకు జరిగింది. అంటే కచ్చితంగా 30 లక్షలు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఇక ఉత్తరాంధ్ర, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు కలిపి ఈ సినిమాకు విడుదలకు ముందు 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, 18 రోజులకు 17 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే రెండు కోట్ల 25 లక్షల రూపాయిల లాభాలు అన్నమాట. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 6 కోట్ల 96 లక్షలు, ఇతర బాషల నుండి రెండు కోట్లు, ఓవర్సీస్ నుండి 12 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 62 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 118 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, నాని కెరీర్ లో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిల్చింది. ఓవరాల్ గా ఈ సినిమా నుండి బయ్యర్స్ కి ఇప్పటి వరకు 12 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి.