Hari Hara Veeramallu : మరో 5 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరేళ్ళు ఎదురు చూసారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికే అనేక అడ్డంకులను ఎదురుకోవాల్సి వచ్చింది. షూటింగ్ పూర్తి అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చెయ్యడం కోసం AM రత్నం మరో యుద్ధమే చేశాడు. అలా ఎన్నో అవాంతరాలను తట్టుకొని ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 24 న విడుదలకు సిద్ధమైంది. అంటే సరిగ్గా 5 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా పోస్టర్స్ లో గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. ప్రతీ పోస్టర్ లోనూ పవన్ కళ్యాణ్ నుదిట సింధూర తిలకం ఉండడాన్ని మనం గమనించాలి.
పోస్టర్స్ లో తిలకం కనిపిస్తుంది కానీ, ట్రైలర్ లో కానీ, టీజర్ లో కానీ, మరే ఇతర ప్రమోషనల్ ఈవెంట్ లో కానీ సిందూర తిలకం లేదు. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది కేవలం ప్రొమోషన్స్ కోసం పోస్టర్స్ కి మాత్రమే పరిమితం చేసారని. సినిమాలో కీలక సమయం లో వచ్చే అసుర హననం లిరికల్ వీడియో సాంగ్ లో కూడా పోస్టర్ సింధూర తిలకం కనిపించలేదు. కేవలం పోస్టర్స్ లో మాత్రమే ఎందుకు ఇలా?, సనాతన ధర్మం కాన్సెప్ట్ మీద తెరకెక్కుతున్న సినిమా కాబట్టి నార్త్ ఇండియన్స్ కి చూడగానే ఆకర్షించేందుకు ఇలా చేశారా?, లేకపోతే సినిమాలో నిజంగా సిందూర తిలకం ఉందా. విచిత్రం ఏమిటంటే థియేట్రికల్ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గ్రీన్ అవుట్ ఫిట్ మీద మచిలీపట్టణం పోర్ట్ లో ఒక పోరాట సన్నివేశం చేసే షాట్ ఒకటి ఉంటుంది. ఈ షాట్ లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ తిలకం పెట్టుకున్న ఆనవాళ్లు మనకు కనిపించదు.
కానీ నేడు విడుదల చేసిన ఆ ఫైట్ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ నుదిట తిలకం ఉంది. అంటే కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ని ద్వేషించే వాళ్ళు అంటున్నారు. మరి మూవీ టీం దీనికి సమాధానం ఇస్తుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ రేట్స్ జీవో వచ్చేసింది. విడుదలకు ముందు రోజు రాత్రి పై ప్రీమియర్ షోస్ కూడా ఖరారు అయ్యాయి. ఇది ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించినది మాత్రమే, తెలంగాణ కి సంబంధించిన జీవో రేపు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.