Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన సినీ నిర్మాతలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడా?, కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోయే ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) లాంటి సినిమాని ఎందుకు ఇంతలా సాగదీస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని 11 సార్లు వాయిదా వేశారు. చివరికి మే 9న విడుదల చేయబోతున్నామని ఇటీవలే ఒక అధికారిక ప్రకటన చేశారు. కానీ ఆ తేదీన కూడా రావడం కష్టమే అని ఫిల్మ్ నగర్ లో బలంగా వినిపిస్తున్న టాక్. కారణం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ బ్యాలన్స్ ఉండడమే. పోనీ ఆ సన్నివేశాలు లేకుండా విడుదల చేయాలన్నా కుదరదట. ఎందుకంటే అవి సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలు, ఎట్టి పరిస్థితిలోనూ షూటింగ్ చేయాల్సిందేనట. కానీ మూవీ టీం పవన్ కళ్యాణ్ ని డేట్స్ అడిగి అడిగి అలిసిపోయారు. గత వారమే ఆయన షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది.
కానీ ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) కి సింగపూర్ లో అగ్నిప్రమాదం జరగడం తో హుటాహుటిన అక్కడికి బయలుదేరాడు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నాడు. బిడ్డ సురక్షితంగా బయటపడిన తర్వాత, మొన్ననే ఇండియాకి తిరిగి వచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా మనమంతా చూసాము. పోనిలే ఇక వచ్చేసాడు, షూటింగ్స్ లో పాల్గొంటాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసారు. ఇటీవలే నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని డేట్స్ అడగగా, ప్రస్తుతం షూటింగ్ చేసే మూడ్ లో లేనని, మరో వారం రోజుల సమయం కావాలని అడిగాడట. నిర్మాత AM రత్నం కి ఏమి మాట్లాడలేని పరిస్థితి. ఒకపక్క అమెజాన్ ప్రైమ్ సంస్థ నుండి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురు అవుతున్నాయి. మే నెలలో విడుదల చేయకపోతే మీతో కాంట్రాక్టు రద్దు చేసుకుంటామని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే మే9 న దింపేయొచ్చు.
మే నెలలో విడుదల కాకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో, అమెజాన్ ప్రైమ్ సంస్థ ఎంత ఒత్తిడి చేస్తుందో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట నిర్మాతలు. అయినప్పటికీ కూడా నాకు ఈ వారం షూటింగ్ చేసే మూడ్ లేదని చెప్పడంతో పాపం నిర్మాత ముఖంలో నెత్తురు చుక్క కూడా లేకుండా పోయిండట. ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఒకవేళ మే నెలలో విడుదల కాకుంటే, ఈ ఏడాది విడుదల లేనట్టే. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ కాంట్రాక్టు రద్దు చేసుకుంటే మరో ఓటీటీ కి వెళ్ళాలి. నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఈ ఏడాది స్లాట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. నిర్మాత AM రత్నం ఆశించిన రేంజ్ లో రైట్స్ కొనగలిగేది కేవలం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు మాత్రమే. వాళ్ళు ఈ ఏడాది చేతులు ఎత్తేస్తే, ఇక హరి హర వీరమల్లు ని వచ్చే ఏడాది విడుదల చేసుకోవడమే. ఇప్పటికే నిర్మాతకు బడ్జెట్ 300 కోట్ల రూపాయిలు దాటేసింది. పాపం ఆయన బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదట. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా సహనం నశించి, నాలుగు రోజుల డేట్స్ ఇవ్వడానికి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటూ ఆయన్ని ట్యాగ్ చేసి బండబూతులు తిడుతున్నారు ట్విట్టర్ లో.