Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం మరో 23 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను నేడు ఒక ప్రెస్ మీట్ ద్వారా గ్రాండ్ గా ప్రారంభించాడు నిర్మాత AM రత్నం. ఇదే ప్రెస్ మీట్ లో ‘అసుర హననం’ పాట ని విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలకైనా ప్రమోషనల్ కంటెంట్స్ లో ది బెస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇదే ప్రెస్ మీట్ లో ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ని కూడా విడుదల చేశారు మేకర్స్.
Also Read : ఓటీటీ లో సంచలనాలు నమోదు చేస్తున్న సుమంత్ అనగనగా..ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!
అది యూట్యూబ్ లో ఇంకా అప్లోడ్ చేయలేదు కానీ, ప్రెస్ కి మాత్రం వేసి చూపించారు. మేకింగ్ వీడియో చూస్తుంటే ఈ సినిమా ఎంత పెద్ద స్కేల్ లో తెరకెక్కించారు అనేది అర్థం అవుతుంది. ఈ మూవీ ఆర్ట్ డైరెక్టర్ గా తోటా తరణి వ్యవహరించాడు. సినిమాలో వచ్చే కీలక ఘట్టాల కోసం రాజకోటలు, దర్బార్లు ఎంతో సృజనాత్మకత తో నిర్మించాడు. ముఖ్యంగా చార్మినార్ ని నిర్మించిన తీరు ని కూడా ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా కష్టపడినట్టు తెలుస్తుంది. ఫైట్ రిహార్సల్స్ చేయడం వంటివి ఆయన ఇప్పటి వరకు ఏ సినిమా కోసం చేయలేదు. కానీ ఈ చిత్రం కోసం ఆయన స్పెషల్ గా కొన్ని మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకొని, స్పెషల్ రిహార్సల్స్ చేసి మరీ చేసాడు. అదంతా ఈ మేకింగ్ వీడియో లో కొంతవరకు చూపించారు.
సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఆ మేకింగ్ వీడియో పై మీరు కూడా ఒక లుక్కు వేయండి. దానిపై మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలే ఉండేవి, కానీ మధ్యలో కరోనా కారణంగా భారీ బ్రేక్స్ రావడం, అదే విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఆ బ్రేక్స్ పొడింపు జరగడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ అవాంతరాలను అన్నీ దాటుకొని ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి వచ్చే నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం నిర్మాత AM రత్నం ఎన్నో అప్పులు చేసాడు. దానికి వడ్డీలు కట్టుకుంటూ ఆయన ఆర్ధిక స్తొమత దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అంతలా నమ్మకం పెట్టి తీసిన ఈ సినిమా ఆయన్ని కాపాడుతుందో, ముంచేస్తుందో చూడాలి.
#HariHaraVeeraMallu Making Video pic.twitter.com/fhPGzDRrcW
— Kalyan Babu™ (@ram_aduri) May 21, 2025