Anaganaga OTT views : ఆహ్లాదకరమైన సినిమాలను తీసే హీరోల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా సుమంత్(Sumanth) ఉంటాడు. అక్కినేని కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ హీరో, మన చిన్నతనం జీవితాంతం గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో చేసాడు. మొదట్లో ఇతనికి పెద్దగా విజయాలు వరించలేదు కానీ, ‘సత్యం’ చిత్రం తర్వాత ఇతని రేంజ్ మారిపోయింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో సుమంత్ రాబోయే రోజుల్లో అక్కినేని కుటుంబం నుండి మరో స్టార్ హీరో గా ఒక వెలుగు వెలుగుతాడని అంతా అనుకున్నారు. సత్యం తర్వాత ఆయన చేసిన గౌరీ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత గోదావరి కూడా కమర్షియల్ గా దుమ్ములేపేసింది. అలా ఎన్నో గుర్తించుకోదగ్గ సినిమాలు చేసిన సుమంత్ మధ్యలో కొన్నాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. రీ ఎంట్రీ తర్వాత ఆయన ‘మళ్ళీ రావా’ , ‘సీతారామం’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు.
Also Read : విడాకుల తర్వాత మొదటిసారి అక్కినేని కుటుంబంతో కలిసిన సమంత..వీడియో వైరల్!
ఈ క్రమంలో ఆయన లేటెస్ట్ గా నటించిన ‘అనగనగా'(Anaganaga) అనే చిత్రం ఈటీవీ విన్ యాప్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో హృద్యంగా చూపించి డైరెక్టర్ శభాష్ అనిపించుకున్నాడు. పాజిటివ్ పబ్లిక్ టాక్ ఒక రేంజ్ లో వ్యాప్తి చెందడంతో ఈ చిత్రానికి వంద మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చాయని ఈటీవీ విన్ యాప్ సంస్థ నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైందా?, విడుదలైతే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లొచ్చని అనేక మంది బుక్ మై షో యాప్ ని ఓపెన్ చేసి వెతికారు. ఆ కారణం చేత ఈ చిత్రం బుక్ మై షో యాప్ లో ట్రెండింగ్ లోకి కూడా వచ్చింది. నిర్మాతలు ఈ చిత్రాన్ని ఓటీటీ కే పరిమితం చేసి తప్పు చేశారా..?, సుమంత్ కి ఒక మంచి బాక్స్ ఆఫీస్ హిట్ ని చాలా కాలం తర్వాత అందుకునే ఛాన్స్ కోల్పోయేలా చేశారా? అని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఓటీటీలో ఇంకా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అనేది.