https://oktelugu.com/

Maharaja Movie: చైనా లో ‘అన్ స్టాపబుల్’ గా దూసుకుపోతున్న విజయ్ సేతుపతి ‘మహారాజా’..ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు ఎంతంటే!

గత ఏడాది స్టార్ వేల్యూ తో సంబంధం లేకుండా కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలతో సమానంగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. అలా తమిళ హీరో విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేసుకొని కంటెంట్ పవర్ ఏంటో చూపించింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 6, 2025 / 12:20 AM IST
    Follow us on

    Maharaja Movie: గత ఏడాది స్టార్ వేల్యూ తో సంబంధం లేకుండా కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలతో సమానంగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. అలా తమిళ హీరో విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేసుకొని కంటెంట్ పవర్ ఏంటో చూపించింది. విజయ్ సేతుపతి లాంటి హీరో ని పెట్టుకొని ‘మహారాజ’ చిత్రాన్ని చిన్న సినిమాల లిస్ట్ లో ఎలా చేర్చారు అని అనుకోకండి. కచ్చితంగా విజయ్ సేతుపతి పెద్ద హీరోనే. కానీ తమిళం లో రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య రేంజ్ స్టార్ అయితే కాదు. ఈ చిత్రానికి ముందు విజయ్ సేతుపతికి ఒక్క వంద కోట్ల గ్రాస్ సినిమా కూడా లేదు. అందుకే ఆయన్ని మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీలో చేర్చాల్సి వచ్చింది.

    ఇది ఇలా ఉండగా ‘మహారాజ’ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమా. ఈ చిత్రం మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సంపాదించి ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ భాషల్లో వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని గత ఏడాది చైనా భాషలోకి దబ్ చేసి భారీ లెవెల్ లో విడుదల చేసారు. చైనా దేశ ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రానికి 91 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్బులోకి చేరుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు. మన ఇండియా నుండి ఇప్పటి వరకు ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’, ‘బాహుబలి 2 ‘, ‘బజరంగీ భాయ్ జాన్’, ‘మహారాజ’ చిత్రాలు మాత్రమే చైనాలో విడుదల అయ్యాయి.

    వీటిల్లో ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్రాలకు చైనా నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ‘బాహుబలి 2 ‘ కి మాత్రం అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కానీ ‘మహారాజ’ చిత్రానికి బాహుబలి 2 కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అలా ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్రాల తర్వాత మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఏకైక ఇండియన్ సినిమాగా మహారాజ చిత్రం సరికొత్త రికార్డుని నెలకొల్పింది. దీంతో ఇప్పటి వరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మహారాజ చిత్రానికి ఇప్పట్లో చైనా దేశం లో థియేట్రికల్ రన్ ఆగే పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ చిత్రం ఇంకా ఎక్కువ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.