Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎట్టకేలకు వచ్చే నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కళకళలాడుతుంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో మొదలు పెట్టారు. రెస్పాన్స్ ఆరంభం లో అదిరింది కానీ, ఇంకా అదనపు షోస్ షెడ్యూల్ చేయకపోవడం తో కాస్త జోరు తగ్గింది. నేడు సాయంత్రం నుండి నార్త్ అమెరికా లోని అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు భారీ గ్రాస్ వసూళ్లను మనం బుకింగ్స్ ద్వారా చూసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే అభిమానుల కోసం ఒక స్వీట్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.
అదేమిటంటే ‘హరి హర వీరమల్లు’ లో రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఉండడమే. సినిమాలో ఉంటాడేమో అని అనుకోకండి. అసలు విషయం లోకి వెళ్తే ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్'(Raja Saab Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి, కేవలం కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కట్ ని సిద్ధం చేశారు. ఈ టీజర్ ని వచ్చే నెల 12 న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి జత చేయబోతున్నారని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఈ నెలలో లేనట్టే..సంచలన ప్రకటన చేసిన డైరెక్టర్!
అందుకే ‘హరి హర వీరమల్లు’ లో ప్రభాస్ అనే ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే ‘రాజాసాబ్’ టీజర్ ని ముందుగా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా?, లేకపోతే డైరెక్ట్ గా ‘హరి హర వీరమల్లు’ థియేటర్స్ లోనే ఈ టీజర్ ని చూడాలా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య మంచి అనుబంధం నడుస్తుంది. ఇప్పుడు మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమైతే వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ ఏడాది చాలా కాలం గ్యాప్ తర్వాత విడుదల అవ్వబోతున్న పెద్ద హీరో చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇండస్ట్రీ ఈ చిత్రం పై చాలా అంచనాలు పెట్టుకుంది.