HHVM Worldwide Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఆరేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా, మధ్యలో ఆగిపోవడం, ఆ తర్వాత మళ్ళీ రెండేళ్లకు ప్రారంభం అవ్వడం, మధ్యలో డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రం నుండి వెళ్లిపోవడం వంటివి జరగడం తో మొదటి నుండే ఈ సినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో డిజాస్టర్ అనే అభిప్రాయం మొదలైంది. కానీ థియేట్రికల్ ట్రైలర్ కట్ కాస్త డీసెంట్ గా ఉండడంతో కనీసం యావరేజ్ రేంజ్ టాక్ అయినా వస్తుంది, ఇక బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అని అనుకున్నారు ఫ్యాన్స్. పాపం పవన్ మీద వీరాభిమానం తో 700 రూపాయిలు టికెట్ రేట్ పెట్టినా, ఎగబడి వెళ్లారు. పుష్ప 2 ని మించిన ప్రీమియర్ షోస్ గ్రాస్ ని ఇచ్చారు.
Also Read: ‘కూలీ’ ట్విట్టర్ రివ్యూస్..లోకేష్ కనకరాజ్ అంచనాలను అందుకున్నాడా?
కానీ సెకండ్ హాఫ్ లో చూపించిన నాసిరకపు గ్రాఫిక్స్ ని చూసి ఫ్యాన్స్ కడుపు మండిపోయింది. ఎంతో ఉత్సాహంగా వెళ్లిన అభిమానులే ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి డిజాస్టర్ టాక్ చెప్పారు. ఫలితంగా వసూళ్ల పై తీవ్రమైన ప్రభావం పడింది. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కారణంగా మొదటి వీకెండ్ ఎలాగో కాస్త వసూళ్లను రాబట్టింది కానీ, ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో పూర్తిగా క్రాష్ అయ్యింది. కానీ సెకండ్ వీకెండ్ లో మెజారిటీ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంది. మూడవ వీకెండ్ లో కూడా కొన్ని చోట్ల పర్లేదు అనిపించింది. కానీ అవి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోడానికి ఏమాత్రం కూడా సరిపోలేదు. చివరికి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. 130 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
Also Read: ‘వార్ 2’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా..? ఫట్టా..?
అంటే దాదాపుగా 50 శాతం నష్టాలను చూడాల్సి వచ్చింది అన్నమాట. పవన్ కళ్యాణ్ గత చిత్రం బ్రో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా, పది రోజులు మంచి వసూళ్లు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి నాలుగు రోజులు కూడా బలమైన వసూళ్లు రాలేదు. ఇది పవన్ ఫ్యాన్స్ ని తీవ్రమైన నిరాశకు గురి చేసిన విషయం. కానీ రెండు నెలల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న ‘ఓజీ’ చిత్రం రానుంది. ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ భారీ కం బ్యాక్ ఇస్తాడు అనే నమ్మకం ఉండడం తో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. హరి హర వీరమల్లు ని సాధ్యమైనంత వరకు మర్చిపోయారు కూడా. కానీ ఎక్కడో ఒక మూల వీరమల్లు పుట్టించిన భయం పవన్ ఫ్యాన్స్ ని వెంటాడుతూనే ఉంటుంది.