Hari Hara Veera Mallu trailer update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) అన్ని సరిగ్గా జరిగి ఉండుంటే రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఉండేది. కానీ VFX వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండడం, సమయానికి ఆ వర్క్ డెలివరీ అవ్వకపోవడం వల్ల సినిమాని వాయిదా వేశారు. సోషల్ మీడియా లో ఈ చిత్రం వాయిదా పడడానికి అనేక కారణాలు రుద్దుతున్నారు కానీ,అసలు కారణం ఇదే. ఈ చిత్రానికి బిజినెస్ అవ్వడం లేదని, అందుకే నిర్మాత ఇన్ని సార్లు వాయిదా వేస్తున్నాడని ఒక పుకారు పుట్టించారు. ఇది నిర్మాత వరకు చేరడంతో,’ఇది పవన్ కళ్యాణ్ సినిమా..బిజినెస్ జరగకపోవడం అనేది కలలో మాటే. తెలుగు రాష్ట్రాలకు కలిపి 120 కోట్లకు అయితే ఈ సినిమా బిజినెస్ నిమిషాల వ్యవధిలో పూర్తి అవుతుంది. కానీ మేము అంత తక్కువకు అమ్మదల్చుకోలేదు. మాది చాలా పెద్ద సినిమా’.
Also Read : పవన్ కళ్యాణ్ మంచితనం కారణంగానే ‘హరి హర వీరమల్లు’ వాయిదా పడిందా?
‘ఇప్పటి వరకు ఆ గ్రాండియర్ ని చూపించలేదు కాబట్టి తక్కువకి అడుగుతున్నారు. అదే VFX పూర్తి అయ్యాక ట్రైలర్ వదిలితే అందరూ షాక్ కి గురి అవుతారు. మేము కోరుకునే రేట్స్ కి బిజినెస్ జరుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత AM రత్నం. ఆయన కేవలం తెలుగు రాష్ట్రాలకే 200 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఆశిస్తున్నాడు. అంత పెద్ద బిజినెస్ ఇప్పటి వరకు మన ఇండస్ట్రీ లో #RRR, పుష్ప 2 లకు మాత్రమే జరిగింది. ఒకవేళ 200 కోట్లకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ అమ్ముడుపోతే మూడవ చిత్రంగా నిలుస్తుంది. నేడు VFX గురించి మూవీ టీం ట్విట్టర్ లో ఒక ఆసక్తికరమైన పోస్టు ని అప్లోడ్ చేసింది. ‘రెండు సంవత్సరాల నుండి ఈ సినిమా VFX మీద అయేజ్హారా స్టూడియో పని చేసింది. విజువల్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయి’.
‘ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎప్పుడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ అతి త్వరలోనే మీరు ఈ సినిమా ద్వారా చూడబోతున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ వారం లోనే థియేట్రికల్ ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారట. ఈ ట్రైలర్ కచ్చితంగా ఈ చిత్రానికి ‘గేమ్ ఛేంజింగ్’ మూమెంట్ అవుతుందని, విజువల్ ఎఫెక్ట్స్ ని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది అసలు మా సినిమానేనా? అని ఆశ్చర్యపోతారని, ఎందుకు ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ రెడీ అవ్వడానికి ఇంత సమయం పట్టింది అనేందుకు సమాధానంగా ఈ థియేట్రికల్ ట్రైలర్ ఉంటుందని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే థియేటర్స్ లో ఈ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారని అంటున్నారు. సినిమా విడుదల తేదీని కూడా ఈ ట్రైలర్ ద్వారానే ప్రకటిస్తారట మేకర్స్. నిన్న మొన్నటి వరకు వీరమల్లు లెక్క వేరు, ట్రైలర్ తర్వాత వీరమల్లు లెక్క వేరు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Visual Brilliance Unleashed! @AlZahraStudio brings 2+ years of dedication to life with mind-blowing visuals for #HariHaraVeeraMallu
Every frame is a testament to cinematic ambition… powered by Director @amjothikrishna visionary touch!
Get ready to witness VFX like… pic.twitter.com/JsDFOoiFrG
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 11, 2025