Hari Hara Veera Mallu Trailer Review: పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ట్రైలర్ ఈ గురువారం రోజున విడుదల కాబోతుంది. అభిమానులు మొదటి నుండి ఈ సినిమాకు కావాల్సినంత హైప్ రాలేదని బాధ పడుతూ ఉన్నారు. ఈ చిత్రం ప్రకటించిన కొత్తల్లో మంచి క్రేజ్ ఉండేది. కానీ ఆ తర్వాత రిపీట్ గా వాయిదాలు పడుతూ రావడంతో ఆ క్రేజ్ కాస్త తగ్గిపోయింది. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆశలన్నీ ట్రైలర్ పైనే పెట్టుకున్నారు. నేడు ఈ ట్రైలర్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యింది. కాసేపటి క్రితమే మూవీ టీం ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ట్రైలర్ ని ప్రదర్శించే థియేటర్స్ జాబితా ని విడుదల చేశారు. అంతే కాకుండా ఈ ట్రైలర్ ని ఇప్పటికే కొంతమంది బయ్యర్స్ కి చూపించారు. వాళ్ళ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ వేరే లెవెల్ లో ఉంది.
ట్రైలర్ లో కనిపించే లాంగ్ పోట్రైట్ షాట్స్, పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ షాట్స్,యానిమల్స్ షాట్స్, ఫైరింగ్ షాట్స్ మరియు ట్రైలర్ చివర్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన డైలాగ్, ఇలా అన్నీ అద్భుతంగా వచ్చాయట. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉందని, పాన్ కళ్యాణ్ కెరీర్ ది బెస్ట్ ట్రైలర్స్ లో ఒకటి గా నిలిచిపోతుందని అంటున్నారు. ఇక ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్ లో ఉందట. మొత్తానికి ఈ ట్రైలర్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ఉండబోతుందట. ఒకపక్క రాజకీయాల్లో ఫుల్ బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్, బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఎలా నటించగలిగాడు అని అభిమానులు ఆశ్చర్యపోవడం పక్కా అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో తెలియాలంటే జులై 3 వరకు ఆగాల్సిందే.
ఈ చిత్రం లో హీరోయిన్ గా నిధి అగర్వాల్(Nidhi Agerwal) నటించిన సంగతి తెలిసిందే. ఇక విలన్ ఔరంగజేబు క్యారక్టర్ ని బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ పోషించాడు. మొదట్లో డైరెక్టర్ క్రిష్ రాసుకున్న బాబీ డియోల్ వెర్షన్ చాలా లిమిటెడ్ గా ఉంటుందట. కానీ బాబీ డియోల్(Bobby Deol) టాలెంట్ కి అది సరిపోలేదని అనిపించి, ఆయన క్యారక్టర్ ని మరింత ఎలివేట్ చేస్తూ ఆయనకు సంబంధించిన సన్నివేశాలన్నీ మళ్ళీ రాసి తెరకెక్కించాడట డైరెక్టర్ జ్యోతి కృష్ణ. ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని. ప్రేక్షకులు కచ్చితంగా బాబీ డియోల్ క్యారక్టర్ ఆర్క్ ని చూసి షాక్ కి గురి అవుతారని అంటున్నారు. బాబీ డియోల్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సన్నివేశాలు ఈ సినిమాలో తక్కువే అట. రెండవ భాగం లో మాత్రం ఫుల్ గా ఉంటాయని అంటున్నారు.
Long portrait shots, horse riding shot, animals shots,firing shot,pk’s last dialogue.Extraordinary cinematography a top notch quality trailer dropping in just 3️⃣ days.
PS : use headphones for the best sound effects and Mmk’s adrenaline BGM #HariHaraVeeraMallu pic.twitter.com/Y5wGTQYnSp
— àkrūthi (@Akruthi94) June 30, 2025