Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie)| ఎట్టకేలకు రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుంది. దాదాపుగా 5 ఏళ్ళ పాటు సెట్స్ లో ఉన్న ఈ చిత్రం టాలీవుడ్ పోలవరం ప్రాజెక్ట్ గా ఎన్నో సెటైర్స్ కి గురి కాబడింది. ఈ మధ్యలో ఈ చిత్రానికి ఎదురైనాన్ని అవాంతరాలు ఏ సినిమాకు కూడా ఎదురు కాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విధి కూడా ఈ చిత్రం తో కబడ్డీ ఆడుకుంది. కానీ ఎట్టకేలకు అవన్నీ దాటుకొని విడుదలకు సిద్ధమైంది. ముందుగా ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికీ ఫస్ట్ కాపీ కూడా రెడీ అయ్యే అవకాశం లేదని డైరెక్టర్ చెప్పడంతో జూన్ 12 న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
Also Read: చనిపోయిన జవాన్ మురళి నాయక్ కుటుంబానికి బాలయ్య భారీ విరాళం!
కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రేపు, లేదా ఎల్లుండి సోషల్ మీడియా ద్వారా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా సిద్ధంగా ఉందట. కేవలం పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పడం ఒక్కటే బ్యాలన్స్ అట. ఈ ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తాయట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ యానిమేషన్ వర్క్ చెన్నై లో జరుగుతుంది. ఆ తర్వాత థియేట్రికల్ ట్రైలర్ కి అటాచ్ చేసి, ఈ నెల 25 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. విడుదల తేదీని ప్రకటించిన రోజు నుండి ప్రతీ రోజు ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందట.
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయం లో నిర్మాత AM రత్నం అసలు ఎక్కడా తగ్గడం లేదట. కేవలం కోస్తాంధ్ర థియేట్రికల్ రైట్స్ దాదాపుగా వంద కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు #RRR , పుష్ప 2 లకు కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగలేదు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 180 కోట్ల రూపాయిలు ఉండేలా ఉందని, ఓవర్సీస్, కర్ణాటక, మరియు ఇతర ప్రాంతీయ భాషలకు 260 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఓపెనింగ్స్ వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. పవన్ కళ్యాణ్ నుండి స్ట్రెయిట్ సినిమాలు వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. రీ ఎంట్రీ తర్వాత ఆయన ఎక్కువగా రీ మేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు. చాలా కాలం తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ సినిమా కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం కుంభస్థలం బద్దలు కొడుతుందని అంటున్నారు ఫ్యాన్స్.