Kamal Haasan Viral Tweet : కమల్ హాసన్(Kamal Haasan) హీరో గా నటించిన ‘థగ్ లైఫ్'(Thug Life) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతటి నెగటివ్ టాక్ కమల్ హాసన్ గత చిత్రం ‘ఇండియన్ 2’ కి కూడా రాలేదు. సోషల్ మీడియా తెరిచి చూస్తే డైరెక్టర్ మణిరత్నం పై అభిమానుల తిట్ల పురాణమే కనిపిస్తుంది. కానీ భారీ అంచనాల నడుమ విడుదలైంది కాబట్టి మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం గట్టిగా వచ్చాయనే చెప్పాలి. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 40 నుండి 50 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు రావొచ్చు అట. అయితే ఈ చిత్రం కర్ణాటక ప్రాంతం లో విడుదల కాలేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
Also Read : ‘హరి హర వీరమల్లు’ కి పోటీగా ‘ఘాటీ’..క్రిష్ సినిమాకు క్రిష్ నే పోటీ!
కారణం కమల్ హాసన్ కన్నడ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నడ బాషా తమిళం నుండే పుట్టింది అంటూ కామెంట్స్ చేయడమే. క్షమాపణలు చెప్పమని కోరారు, కానీ ఆయన నా తప్పు లేకుండా క్షమాపణలు చెప్పను అంటూ మొండికేసాడు. అయితే సినిమా బ్యాన్ చేస్తామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరిస్తే, చేసుకోండి అంటూ బదులిచ్చాడు. అలా ఈ చిత్రం నేడు కర్ణాటక లో విడుదల కాలేదు. అయితే విడుదలకు ముందు రోజు కమల్ హాసన్ వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే IPL లో ట్రోఫీ ని గెలిచిన తర్వాత RCB టీం ప్లేయర్స్ మొత్తం బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం ప్రాంగణం లోకి అడుగుపెట్టి ప్రభుత్వ సత్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన క్రికెటర్స్ ని చూడడానికి అసంఖ్యాకంగా అభిమానులు చేరుకోవడం వల్ల తొక్కిసిలాట జరిగింది. ఈ తొక్కిసిలాట ఘటనలో ఏకంగా 11 మంది ప్రాణాలను వదలడం దేశవ్యాప్తంగా పెను దుమారమే రేపింది.
ఈ ఘటన పై సినీ సెలబ్రిటీల నుండి రాజకీయ నాయకుల వరకు ప్రతీ ఒక్కరు స్పందించారు . వారిలో కమల్ హాసన్ కూడా ఒకరు. ఆయన మాట్లాడుతూ ‘బెంగళూరు లో జరిగిన తొక్కిసిలాట ఘటన నా హృదయాన్ని కలిచి వేసింది. నా మనసంతా ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతుంది. ఈ కష్టసమయంలో వాళ్లకు తగిన మనోధారియం సమకూరలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఒకపక్క తన సినిమా కర్ణాటక లో విడుదల చేయడానికి ఒప్పుకోకపోయినప్పటికీ కమల్ హాసన్ కన్నడ ప్రజలపై స్వచ్ఛమైన ప్రేమ చూపించడం నిజంగా హర్షణీయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Heart wrenching tragedy in Bangalore. Deeply distressed and my heart reaches out to the families of the victims in this moment of grief. May the injured recover soon.
— Kamal Haasan (@ikamalhaasan) June 4, 2025