Hari Hara Veera Mallu Producer AM Rathnam : ఏ ముహూర్తం లో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమాని మొదలు పెట్టారో తెలియదు కానీ, అప్పటి నుండి ఈ చిత్రానికి ఎదురైనటువంటి కష్టాలు ఏ చిత్రానికి కూడా ఎదురు అయ్యి ఉండవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం 9 నెలల్లో షూటింగ్ పూర్తి చేసే ప్లాన్ తో ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ సమయంలోనే సమాంతరంగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. కానీ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘భీమ్లా నాయక్’ రీమేక్ ని కూడా పవన్ కళ్యాణ్ కి అంటించాడు. అలా ఈ మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీ గా ఉంటున్న సమయంలో కరోనా మహమ్మారి విజృంభించింది. లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ తిరిగి మొదలయ్యాక పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ముందుగా భీమ్లా నాయక్ ని పూర్తి చేశాడు.
Also Read : విజయ్ దేవరకొండతో కాఫీ షాప్ లో తమన్నా..సంచలనం రేపుతున్న వీడియో!
ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి రామోజీ ఫిలిం సిటీ లో ‘హరి హర వీరమల్లు’ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొనడం మొదలు పెట్టారు. సుమారుగా రెండు నెలలు కేవలం ఆ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకోవడం వంటివి జరిగాయి. ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి అయ్యాక కొంత గ్యాప్ తీసుకొని షూటింగ్ ని పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. జూన్ 12 న ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇది ఇలా ఉండగా నిర్మాత AM రత్నం కి ఈ చిత్రాన్ని జూన్ 12 న విడుదల చేయడం అసలు ఇష్టమే లేదట. ఎందుకంటే ఈ సినిమాకు ఆయన ఎక్కువగా ప్రొమోషన్స్ చేయాలని అనుకున్నాడు. ప్రొమోషన్స్ కి సమయం లేకపోవడంతో చాలా బాధపడ్డాడట. అమెజాన్ ప్రైమ్ సంస్థ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో జూన్ 12 న విడుదల చేయాలి.
దీంతో వేరే గత్యంతరం లేక ఈ చిత్రాన్ని ఆ తేదీన విడుదల చేస్తున్నాం అంటూ రీసెంట్ గా రత్నం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటి వరకు రాలేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడం మనమంతా చూస్తూనే ఉన్నాం. కానీ ట్రైలర్ లో VFX షాట్స్ పర్ఫెక్షన్ కోసమే ఆగమని, ట్రైలర్ ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు షాక్ కి గురి అవుతారని, పాలిటిక్స్ లో బిజీ గా ఉండే పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద సినిమా ఎలా చేసాడని ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటారు అంటూ AM రత్నం మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
