Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా యావత్ తెలుగు నిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి…కెరియర్ మొదట్లోనే వరుసగా ఏడు విజయాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నాడు. ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక క్రిష్ డైరెక్షన్ లో నాలుగు సంవత్సరాల కిందట మొదలుపెట్టిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా షూటింగ్ ఇప్పటివరకు పూర్తయితే కాలేదు. ఈ మూవీ లేట్ అవుతుందని గ్రహించిన క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఏ ఏం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ షూట్ బ్యాలెన్స్ ఉందని, 20 రోజులపాటు ఆయన డేట్స్ ని కేటాయిస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అంటూ తెలిపిన మేకర్స్ ఇప్పుడు మాత్రం రెండు రోజులు షూట్ చేసి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని చెబుతున్నారు.
Also Read : హరి హర వీరమల్లు’ టీంని శాసిస్తున్న ‘అమెజాన్ ప్రైమ్’..విడుదల తేదీపై భారీ ట్విస్ట్!
దానికి కారణం ఏంటి అంటే ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వాళ్లు హరిహర వీరమల్లు సినిమా ఓటిటి రైట్స్ ను ఒక ఫ్యాన్సీ రేటుకి అయితే దక్కించుకున్నారు. ఇక ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లేట్ అవుతూ రావడంతో వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. దానివల్ల ఈ సినిమా రైట్స్ కోసం వాళ్లు వెచ్చించిన కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి.
అందుకే ఈ సినిమా టీం మీద అమెజాన్ వాళ్ళు లీగల్ గా నోటీసులైతే పంపించారు. దాంతో సినిమాను తొందరగా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో 20 రోజుల్లో పూర్తవ్వాల్సిన పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను కేవలం రెండు రోజుల్లోనే కంప్లీట్ చేశారు. ఇలా ఎలా సాధ్యమైంది అని కొంతమంది సినిమా మేధావులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఇలా చేస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది. ఇన్ని రోజులు ఈ సినిమా కోసం వేచి చూసిన మాకు ఈ సినిమా కూడా సక్సెస్ ని అందించి పెట్టదా? అనే ఒక డైలామా ఉన్నారు. కేవలం అమెజాన్ ప్రైమ్ వాళ్ల కోసమే ఈ సినిమాని తొందరగా చుట్టేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది…