https://oktelugu.com/

ప్రముఖ సింగర్ కు వేధింపులు. డైరెక్టర్ అరెస్ట్

వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుంది. అది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. కొందరికి డబ్బు మీద యావ ఉంటే మరికొందరికి మద్యం మీద ఉంటుంది. ఇంకొందరికి మగువలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అది ఉన్న వారి వారి మనోగతంపై ఆధారపడి ఉంటుంది. వారి దారిలో వారు ఎంచుకునే మార్గాలపై కూడా ఆధారడపి ఉంటుంది. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లుగా నాగరితక పెరుగుతున్న క్రమంలో వేలం వెర్రి కూడా పెరిగిపోతోంది. భవిష్యత్తును సైతం లెక్కచేయకుండా తాము అనుకున్న దారినే […]

Written By:
  • NARESH
  • , Updated On : July 17, 2021 / 07:36 PM IST
    Follow us on

    వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుంది. అది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. కొందరికి డబ్బు మీద యావ ఉంటే మరికొందరికి మద్యం మీద ఉంటుంది. ఇంకొందరికి మగువలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అది ఉన్న వారి వారి మనోగతంపై ఆధారపడి ఉంటుంది. వారి దారిలో వారు ఎంచుకునే మార్గాలపై కూడా ఆధారడపి ఉంటుంది. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లుగా నాగరితక పెరుగుతున్న క్రమంలో వేలం వెర్రి కూడా పెరిగిపోతోంది. భవిష్యత్తును సైతం లెక్కచేయకుండా తాము అనుకున్న దారినే నమ్ముతూ జీవితాల్ని నాశనం చేసుకుంటున్న వారెందరో.

    సామాజిక మాధ్యమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్ లాంటి వాటి ద్వారా ప్రపంచం చిన్నదిగా మారిపోతోంది. ఎంత దూరమైనా దగ్గర అనుకునే విధంగా నెట్ విస్తరిస్తోంది. దీంతో నాగరికత ముసుగులో అనాగరికత పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. ఫలితంగా ఎన్నో సాధించాల్సిన వయసులో చిన్న పాటి తప్పులకే తిప్పలు పడుతున్నారు. ముళ్ల దారినే పూలపానుపుగా భావించి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.

    ఈ నేపథ్యంలో తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయనికి గత కొంత కాలంగా నవీన్ కుమార్ అనే వ్యక్తి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఫేస్ బుక్ ఇన్ స్టాలలో ఆమె పేరుతో ఖాతా తెరవడమే కాకుండా సదరు గాయని ఫొటోతో ఫిల్మ్ ప్రొడక్షన్ ను సైతం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ కేటుగాడు ఓ యూ ట్యూబ్ చానల్ లో గాయనిపై అశ్లీల కంటెంట్ అప్ లోడ్ చేస్తున్నాడు. ఈ విషయం ఆమె  కుటుంబానికి సన్నిహితుల ద్వారా తెలియడంతో వారు షాక్ కు గురయ్యారు.

    ఇదిలా ఉండగా సదరు వ్యక్తికి ఫోన్ చేసి సోషల్ మీడియాలో తన పేరుపై పెట్టిన ఖాతాను తొలగించాలని సింగర్ కోరింది. ఆమె మాటలను పట్టించుకోని అతడు తాను చేసే పనులకు ఎన్ వోసీ ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడు. దీంతో ఆ సింగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాచకొండ పోలీసులు నిందితుడు నవీన్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. కాగా నవీన్ కుమార్ ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా చెబుతున్నారు.