https://oktelugu.com/

Chiranjeevi Birth Day: చిరంజీవిని స్టార్ ను చేసిన సినిమా అదే

తెలుగు చిత్రసీమలో స్వయంకృషితో ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవినే. తెలుగులో ఇప్పుడు నంబర్ వన్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Birth Day) వెలుగొందుతున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ కు సంబంధించిన కొత్త సినిమాల విశేషాలు.. ఆయన సినీ జీవితంపై బోలెడు కథనాలు వస్తున్నాయి. తెలుగు చిత్రసీమలో నటుడిగా, విలన్ గా.. అనంతరం హీరోగా అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి ఎన్నో కష్టనష్టాలను అనుభవించి ఎత్తుపల్లాలను చూసిన తర్వాత ఈ ఉన్నత స్థానానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2021 / 08:17 AM IST
    Follow us on

    తెలుగు చిత్రసీమలో స్వయంకృషితో ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవినే. తెలుగులో ఇప్పుడు నంబర్ వన్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Birth Day) వెలుగొందుతున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ కు సంబంధించిన కొత్త సినిమాల విశేషాలు.. ఆయన సినీ జీవితంపై బోలెడు కథనాలు వస్తున్నాయి.

    తెలుగు చిత్రసీమలో నటుడిగా, విలన్ గా.. అనంతరం హీరోగా అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి ఎన్నో కష్టనష్టాలను అనుభవించి ఎత్తుపల్లాలను చూసిన తర్వాత ఈ ఉన్నత స్థానానికి చేరుకొని స్టార్ హీరోగా మారాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ జనరేషన్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తెలుగులో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్ధాలుగా తన హవాను చూపిస్తూ దూసుకుపోతూనే ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22 ) సందర్భంగా ఆయన జీవితంలో స్టార్ ను చేసిన సినిమా గురించి తెలుసుకుందాం.

    1955 ఆగస్టు 22న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల శివశంకర వరప్రసాద్ గా చిరంజీవి జన్మించారు. తండ్రి కొణిదెల వెంకట్రావ్, తల్లి అంజనాదేవి. 1980లో ప్రముఖ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు.

    1978లో ‘పునాదిరాళ్లు’ అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి చిరంజీవి ప్రవేశించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ సినిమా చిరంజీవి కెరీర్ ను మార్చేసింది. ఇందులో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు అప్పట్లోనే ఈ సినిమా రూ.4 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఈ మూవీతోనే చిరంజీవికి స్టార్ స్టేటస్ వచ్చింది. అప్పటి నుంచి చిరంజీవి ఇక వెనుదిరిగి చూడలేదు.

    ఖైదీ సూపర్ హిట్ తో ఇండస్ట్రీలో నిలబడ్డ చిరంజీవిని ‘చంటబ్బాయ్’, గ్యాంగ్ లీడర్, చాలెంజ్, అభిలాష, శుభలేఖ, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్బాంధవుడు, యముడికి మొగుడు, అత్తకు యముడు.. అల్లుడికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, బావగారూ బాగున్నారా; ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖైదీనంబర్ 150 సహా ఎన్నో చిత్రాలతో తెలుగులో మెగాస్టార్ గా ఎదిగారు. చిరంజీవి కెరీర్ కు ఊపిరిపోసిన చిత్రం మాత్రం ‘ఖైదీ’ అని చెప్పొచ్చు.