
ప్రయాణ సామగ్రిలో తూటా దొరికిన కేసులో మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు సిద్ధార్థను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు శనివారం మరోసారి విచారించారు. ఈనెల 18న సిద్ధార్థను విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అతని సామగ్రిలో తూటా గుర్తించి కేసు పెట్టారు. దీనిపై పోలీసులు తాఖీదులు జారీచేయడంతో తూటాకు సంబంధించిన ధ్రువపత్రాలతో సిద్ధార్థ విచారణకు హాజరయ్యారు. తూటా, అనుమతి ఉన్న ఆయుధంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.