Low Interest Gold Loan: ఎవరైనా లోన్ ను తీసుకోవాలని అనుకుంటే గోల్డ్ లోన్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. తక్కువ వడ్డీ రేటుకే గోల్డ్ లోన్ ను పొందాలని అనుకునే వాళ్లు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల ద్వారా సులువుగా లోన్ ను తీసుకోవచ్చు. అయితే గోల్డ్ లోన్ ను తీసుకోవాలని అనుకునే వాళ్లు ఎక్కడ తక్కువగా వడ్డీరేట్లు ఉంటే అక్కడ గోల్డ్ లోన్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో సులువుగా గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకునే వాళ్లు ఈఎంఐ టెన్యూర్ వివరాలను తెలుసుకుంటే మంచిది.
బంగారంను తాకట్టు పెట్టేవాళ్లు లక్ష రూపాయల విలువ ఉన్న బంగారంపై గరిష్టంగా 75వేల రూపాయల వరకు రుణాన్ని తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. బ్యాంకుల్లో, ఎన్‌బీఎఫ్‌సీల్లో వడ్డీ రేట్లను సులభంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్‌లో 14.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌లో 11 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 9 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 8.95 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 8.75 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.45 శాతం, యూనియన్ బ్యాంక్‌లో 8.2 శాతం వడ్డీరేటుకు గోల్డ్ లోన్పొందవచ్చు.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.5 శాతం వడ్డీరేటుకు గోల్డ్ లోన్ ను అందిస్తోంది. కెనరా బ్యాంక్‌లో 7.35 శాతం వడ్డీరేటును గోల్డ్ లోన్ ను పొందే అవకాశం ఉంటుంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 7 శాతం నుంచి పొందే అవకాశం ఉంటుంది. ముత్తూట్ ఫైనాన్స్‌లో 11.9 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభమవుతుంది. మణప్పురం ఫైనాన్స్‌లో 12 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
రెండు సంవత్సరాల కాలపరిమితిపై రుణాలను తీసుకుంటే నెలకు రూ.4477 నుంచి రూ.4707 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించి ఈ గోల్డ్ లోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.