Hanuman Collections: ఈ ఏడాది ఒక సెన్సేషనల్ మూవీతో ఆరంభం అయ్యింది. హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది. తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ రికార్డులు బద్దలు కొడుతుంది. హనుమాన్ చిత్ర విడుదల విషయంలో పెద్ద హైడ్రామా నడిచింది. థియేటర్స్ సమస్య కారణంగా విడుదల వాయిదా వేయాలని నిర్మాత మీద ఒత్తిడి తెచ్చాడు. హనుమాన్ వాయిదా వేసే ప్రసక్తే లేదని చిత్ర యూనిట్ తేల్చి చెప్పారు.
గుంటూరు కారం చిత్రానికి పోటీగా జనవరి 12న హనుమాన్ విడుదలైంది. చాలా తక్కువ మొత్తంలో థియేటర్స్ దొరికాయి. అయితే హనుమాన్ పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఇతర భాషల్లో కూడా ఆదరణ లభించింది. దీంతో ఊహించని వసూళ్లు దక్కాయి. వీకెండ్ గ్రాండ్ గా ముగించిన హనుమాన్ అరుదైన రికార్డ్స్ నమోదు చేసింది.
హనుమాన్ మూవీ వంద కోట్ల మార్క్ దాటేసింది. హనుమాన్ వీకెండ్ కలెక్షన్స్ లో సలార్, బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేయడం మరొక విశేషం. తేజ సజ్జా వంటి హీరోకి ఈ రేంజ్ వసూళ్లు ఊహించనివే. నార్త్ అమెరికాలో హనుమాన్ $ 3 మిలియన్ వసూళ్లు క్రాస్ చేయడం, సినిమా ఏ స్థాయిలో ఆదరించబడుతుందో నిదర్శనం.
హనుమాన్ బాక్సాఫీస్ వద్ద ఇంకా సత్తా చాటుతుంది. మరో వారం వరకు హనుమాన్ కలెక్షన్స్ సాలిడ్ గా ఉంటే అవకాశం కలదు. హిందీలో హనుమాన్ వసూళ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రన్ ముగిసేనాటికి హనుమాన్ భారీ ఫిగర్స్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. హనుమాన్ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక రోల్స్ చేశారు. సోషియో ఫాంటసీ అంశాలతో హనుమాన్ తెరకెక్కింది.