https://oktelugu.com/

Prashant Verma : పేరు వాడుకున్నందుకు మహేష్ బాబు మేనల్లుడిని డబ్బులు డిమాండ్ చేస్తున్న ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ!

చిన్న డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన నేడు 'హనుమాన్' చిత్రంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఇప్పుడు ఆయన పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఆ బ్రాండ్ ని ఉపయోగించుకొని కొత్త డైరెక్టర్స్ ఎదిగేందుకు చూస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 / 05:57 PM IST

    Prashant Verma

    Follow us on

    Prashant Verma : స్టార్ డైరెక్టర్స్ బ్రాండ్ ని ఉపయోగించుకొని చిన్న డైరెక్టర్స్ సినిమాలు చేయడం కొత్తేమి కాదు. దశాబ్దాల నుండి ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది దర్శకులు ఇలా పైకి వచ్చారు. అందుకు ఉదాహరణ రాజమౌళినే. ఈయన కెరీర్ ప్రారంభంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఆ తర్వాత ఒక ‘శాంతి నివాసం’ అనే టీవీ సీరియల్ కి దర్శకత్వం వహించిన రాజమౌళి, స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా మారాడు. ఆ సినిమాకి ఆయన రాఘవేంద్ర రావు బ్రాండ్ ఇమేజ్ ని ఉపయోగించుకోవాల్సి వచ్చింది. అదే విధంగా డైరెక్టర్ సుకుమార్ బ్రాండ్ ని వాడుకొని నూతన దర్శకులు ‘కుమారి 21F’, ‘విరూపాక్ష’, ‘ఉప్పెన’ వంటి చిత్రాలు తెరకెక్కించారు. వీరిలో ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చి బాబు బాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాన్ ఇండియన్ చిత్రం చేసే స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పుడు రాజమౌళి, సుకుమార్ తరహా లో ప్రశాంత్ వర్మ కూడా మారిపోయాడు.

    చిన్న డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన నేడు ‘హనుమాన్’ చిత్రంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఇప్పుడు ఆయన పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఆ బ్రాండ్ ని ఉపయోగించుకొని కొత్త డైరెక్టర్స్ ఎదిగేందుకు చూస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో గా నటిస్తున్న రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ఈ చిత్రానికి ‘గుణ 369 ‘ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించాడు. నవంబర్ 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి 25 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ పెడుతున్నారట. అయితే ఈ చిత్రానికి మార్కెట్ జరగడం కోసం డైరెక్టర్ అర్జున్ జంధ్యాల హనుమాన్ డైరెక్టయిర్ ప్రశాంత్ వర్మ పేరు ని వాడుకున్నాడు. అలా ఆయన పేరుని వాడుకున్నందుకు గాను 8 కోట్ల రూపాయిలను డిమాండ్ చేసాడట ప్రశాంత్ వర్మ. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    ఇది తెలుసుకున్న నెటిజెన్స్ ఒక్క సినిమా సూపర్ హిట్ అయ్యినందుకే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?, పేరు ని ఉపయోగించుకున్నందుకు 8 కోట్లా..?, చాలా మంది దర్శకులు ఇప్పటికీ ఒక సినిమాకి దర్శకత్వం వహించినందుకు 5 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అలాంటిది పేరు వాడుకునేందుకు అనుమతి కోసం 8 కోట్లు డిమాండ్ చేయడం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.