https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ చెప్పినట్టే.. పోలీసులు చేశారు..వర్రా రవీందర్ రెడ్డిని వదిలేశారు.. సీఎం, డీజీపీ సీరియస్*

నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. వైసిపి హయాం నుంచే పోలీస్ శాఖ పనితీరుపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయని.. ఇప్పటికీ వారి పనితీరు మార్చుకోలేదని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఆరోపణలకు తగ్గట్టుగానే ఈరోజు పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : November 6, 2024 / 05:59 PM IST

    Pawan Kalyan(32)

    Follow us on

    Pawan Kalyan: ఏపీలో ఇప్పటికీ వైసీపీ పాలన కొనసాగుతోందా? ఆ పార్టీ ఆదేశాల ప్రకారం పోలీసులు పని చేస్తున్నారా? డిప్యూటీ సీఎం పవన్ అనుమానం నిజమేనా? పోలీస్ శాఖ పై ఆయన ఆగ్రహం లో బాధ ఉందా? ఆయన బాధ్యతతోనే హోం శాఖతో పాటు పోలీసు వ్యవస్థపై మాట్లాడారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ రెడ్డిని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసిపి హయాంలో చంద్రబాబు, పవన్, లోకేష్, మహిళా నేత వంగలపూడి అనితలపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన వారిలో రవీందర్ రెడ్డి ముందుండే వారు. కడప జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి సోషల్ మీడియా నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకొని మరి నేతలపై దుష్ప్రచారం చేశారు. ప్రత్యర్థి పార్టీల నేతలను వెంటాడారు. ఈయనపై ఏపీ వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు కడప పోలీసులు. రహస్యంగా విచారించి 41ఏ నోటీసులు అందించి విడిచిపెట్టారు. తదుపరి కేసులో విచారించేందుకు వెళ్ళగా రవీందర్ రెడ్డి కనిపించకుండా పోయారు. దీంతో ఇక్కడ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దీనిపై సీఎం చంద్రబాబు తో పాటు డిజిపి ద్వారకా తిరుమలరావు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో హోట పుట్టిన పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. రవీందర్ రెడ్డి కోసం గాలిస్తోంది.

    * పోలీస్ వ్యవస్థ పనితీరుపై ఆగ్రహం
    రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. పోలీస్ వ్యవస్థ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి హయాం నుంచి పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని.. అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోందని ఆక్షేపించారు. అందుకే హోం శాఖ మంత్రి సీరియస్ గా చర్యలు ప్రారంభించాలని కోరారు. ఈ క్రమంలోఅవసరమైతే తాను హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానని స్పష్టం చేశారు. అయితే ఇక్కడే పవన్ వ్యాఖ్యల్లో అసలైన విషయం బయటపడింది. పోలీస్ శాఖలో అరెస్టుల సమయంలో కులం, మతం, ప్రాంతం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. వాటిని సాకుగా చూపి తప్పించుకుంటున్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏకంగా ఓ సైబర్ నేరస్తుడు పోలీసులు నుంచి తప్పించుకోవడం వెనుక.. పవన్ ఆరోపణలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. పోలీసుల అలసత్వంతోనే వర్రా రవీందర్ రెడ్డి తప్పించుకున్నారని అర్థమవుతోంది.

    * సీఎం, డిజిపి ఆదేశాలతో
    ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో పోలీస్ శాఖ తీరుపై బలమైన చర్చ నడుస్తోంది. ఇటువంటి సమయంలోనే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం హార్ట్ టాపిక్ అవుతోంది. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిజిపి ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ హుటాహుటిన కడప చేరుకున్నారని తెలుస్తోంది. ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో డిఐజి సమావేశం అయ్యారు. మరోవైపు వర్రా రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.