https://oktelugu.com/

Malliswari: ‘మల్లీశ్వరి’ చిత్రంలోని ఈ డైనింగ్ టేబుల్ గుర్తుందా..? దీని విలువ, చరిత్ర ఏంటో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

మొదటి చిత్రంతోనే ఈమె ప్రేక్షకులను తన అందంతో, నటనతో కట్టిపారేసింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ని ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చూసిన తనివితీరదు. వెంకటేష్, సునీల్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా హైలైట్ గా ఉంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 / 05:56 PM IST

    Malliswari(2)

    Follow us on

    Malliswari: త్రివిక్రమ్ దర్శకుడిగా మారే ముందు ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించే సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించేవాడు. ఆరోజుల్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడమే కాకుండా, తెలుగు ప్రేక్షకులు జీవితాంతం తమ జ్ఞాపకాల్లో గుర్తించుకునే కల్ట్ క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి. వాటిల్లో ఒకటి ‘మల్లీశ్వరి’. విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక సెన్సేషన్. అప్పట్లోనే ఈ చిత్రానికి 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది. ఈ చిత్రం ద్వారా కత్రినా కైఫ్ తొలిసారి వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ కి వెళ్లడం, పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వడం వంటివి మన అందరికీ తెలుసు. మొదటి సినిమాకే ఆమె ఆరోజుల్లో కోటి రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుందట.

    మొదటి చిత్రంతోనే ఈమె ప్రేక్షకులను తన అందంతో, నటనతో కట్టిపారేసింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ని ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చూసిన తనివితీరదు. వెంకటేష్, సునీల్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా హైలైట్ గా ఉంటాయి. ఇలా ఈ చిత్రంలో ప్రతీ ఫ్రేమ్ చూసే కొద్దీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కాబట్టే, ఇప్పటికీ టీవీ టెలికాస్ట్ లో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంటూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మనం చూసే ప్యాలెస్ పేరు లలిత మహాల్. కర్ణాటక ప్రాంతంలోని మైసూరు లో ఈ అందమైన ప్యాలెస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్యాలెస్ లో ఎన్నో సినిమాల షూటింగ్స్ జరిగాయి, అందులో మల్లీశ్వరి చిత్రం కూడా ఒకటి.

    అయితే ఈ సినిమాలో ఉండే డైనింగ్ టేబుల్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 20 మందికి పైగా కూర్చొని తినగలిగేంత కెపాసిటీ ఉన్న ఈ డైనింగ్ టేబుల్ ప్యాలెస్ లో ఉండేది కాదట. నిర్మాత సురేష్ బాబు కేవలం కొన్ని సన్నివేశాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడట. ఈ టేబుల్ ని తయారు చేయడం కోసం ఆరోజుల్లోనే 15 లక్షల రూపాయలకు పైగా డబ్బులు ఖర్చు చేశారట. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ డైనింగ్ టేబుల్ ని ప్యాలెస్ వాళ్ళకే ఇచ్చేశారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. అప్పట్లో ఈ చిత్రానికి దాదాపుగా 8 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారట. సురేష్ ప్రొడక్షన్స్ లో అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రం గా ‘మల్లీశ్వరి’ తెరకెక్కిందని ప్రచారం జరిగింది. ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ ఎలా కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రేక్షకులు ‘మల్లీశ్వరి’ రీ రిలీజ్ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.