ఈమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం గార్డియన్ . తమిళం లో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. తెలుగు లో ఆమె కనిపించిన చివరి చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. 2024 వ సంవత్సరం లో ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ కి జడ్జీగా వ్యవహరించింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. కానీ సోషల్ మీడియా ద్వారా ఈమె నిత్యం అభిమానులతో దగ్గరగానే ఉంటూ వస్తోంది. ఈమె యూట్యూబ్ ఛానల్ కూడా ఫుల్ యాక్టీవ్ గా నడుస్తోంది. మరి విడాకుల తర్వాత హన్సిక కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.
Hansika Motwani officially divorced: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
Hansika Motwani officially divorced: తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ హన్సిక(Hansika Motwani), నాలుగేళ్ల క్రితం సోహైల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. అన్య మతానికి చెందిన వాడు అయినప్పటికీ కూడా , అతన్ని పెళ్లి చేసుకోవడం పై అప్పట్లో హన్సిక పై ప్రశంసల వర్షం కూడా కురిసింది. రెండేళ్ల పాటు ఎంతో సాన్నిహిత్యంతో సాగిన ఈ వైవాహిక బంధం మధ్య కొన్ని విబేధాలు చోటు చేసుకున్నాయి. వీళ్ళ మధ్య విబేధాలకు అసలు కారణం ఈగో క్లాషెస్. సోహైల్ గొప్ప ఆస్తి పరుడు. ఆయనకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, లెక్కలేనంత డబ్బు కూడా ఉంది. హన్సిక కేవలం ఒక సినీ హీరోయిన్ మాత్రమే . పైగా ఆమె కెరీర్ కూడా ఇప్పుడు అంత గొప్పగా సాగడం లేదు.సోహైల్ హన్సిక తల్లిదండ్రులను ఒక సందర్భం లో అవమానించడం దగ్గర నుండి ఈ విభేదాలకు భీజం పడిందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. రెండేళ్ల నుండి హన్సిక తన పుట్టింట్లోనే ఉంటుంది. ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి కానీ, చాలా మంది అది నమ్మలేదు. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ , ఆమె పూర్తిగా వైవాహిక బంధం నుండి బయటకు వచ్చేసింది. కోర్టు వీళ్లిద్దరికీ విడాకులు మంజూరు చేసేసింది. అలా నాలుగేళ్ల వీళ్లిద్దరి దాంపత్య జీవితానికి ముగింపు పలికింది. ఇప్పుడు హన్సిక పూర్తిగా తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదకు షిఫ్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. కొత్త హీరోయిన్స్ రాకతో హన్సిక కి ఈమధ్య కాలంలో సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి అనేది వాస్తవం. పెళ్ళికి ముందు ఆమె కెరీర్ చాలా బాగుండేది కానీ, పెళ్లి తర్వాత మాత్రం బాగా డౌన్ అయ్యింది.