Hansika
Hansika : తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ హన్సిక(Hansika Motwani). బాలీవుడ్ లో బాలనటిగా ఈమె సినీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత టాలీవుడ్ లో ‘దేశముదురు’ సినిమా ద్వారా హీరోయిన్ గా మన ఆడియన్స్ కి పరిచయమైంది. అప్పటికి ఆమె వయస్సు కేవలం 15 ఏళ్ళు మాత్రమే. అంత చిన్న వయస్సులో హీరోయిన్ గా మారిన హన్సిక, అతి తక్కువ సమయంలోనే సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని అందుకునే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఆమె జోరు బాగా తగ్గింది కానీ, చేసే సినిమాలు అయినా చాలా సెలెక్టివ్ గా చేసుకుంటూ ముందుకు పోతుంది. చూసేందుకు ఎంతో క్యూట్ గా కనిపిస్తూ, ఎంతో క్యూట్ గా చిలిపిగా, చిన్న పిల్ల లాగా మాటలే హన్సిక పై గృహ హింస కేసు నమోదు అయ్యిందంటే నమ్ముతారా..?.
Also Read : హీరోయిన్ హన్సికపై కేసు నమోదు, ఆమె చేసిన నేరం ఏమిటో తెలుసా?
కానీ నమ్మాలి అదే నిజం కాబట్టి. నిన్న ఆమె తనపై నమోదైన గృహ హింస కేసు ని కొట్టివేయాలంటూ ముంబై హై కోర్ట్ లో క్వాష్ పిటీషన్ ని దాఖలు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ 2020 వ సంవత్సరం లో ప్రముఖ టీవీ నటి ముస్కాన్ జేమ్స్ ని ప్రేమించి పెళ్లాడాడు. అయితే పెళ్ళయిన కొద్దిరోజులకే వీళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె ప్రశాంత్, హన్సిక మరియు హన్సిక తల్లి జ్యోతిలపై గృహ హింస చట్టం క్రింద కేసు వేసింది. ఈ కేసు నుండి ముందస్తు బెయిల్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి లో హన్సిక, ఆమె తల్లి జ్యోతి ముంబై హై కోర్టు ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు.
ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హై కోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్ ని మంజూరు చేసింది. ఈ క్రమంలోనే తమపై నమోదైన ఈ కేసు ని కొట్టేవేయాలంటూ క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. మరి దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇది ఇలా ఉండగా హన్సిక ప్రస్తుతం తమిళం లో ‘రౌడీ బేబీ’, ‘మ్యాన్’, ‘గాంధారి’ వంటి చిత్రాలు చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు ఆమె బుల్లితెర పై ‘ఢీ జోడి’ వంటి డ్యాన్స్ రియాలిటీ షో కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. సినిమాలతో పాటు హన్సిక మరోపక్క వెబ్ సిరీస్ లు కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె నషా అనే వెబ్ సిరీస్ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read : ప్రముఖ హీరోయిన్ హన్సిక పై స్టార్ హీరో లైంగిక వేధింపులు..బయటపడిన సంచలన నిజాలు!