https://oktelugu.com/

Hansika: హీరోయిన్ హన్సికపై కేసు నమోదు, ఆమె చేసిన నేరం ఏమిటో తెలుసా?

స్టార్ లేడీ హన్సిక మోత్వానీ పై కేసు నమోదు అయ్యింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హన్సిక తమ్ముడు ప్రశాంత్ మోత్వానీ భార్య ముస్కాన్ ఈ కేసు పెట్టినట్లు సమాచారం. ఇంతకీ హన్సిక చేసిన నేరం ఏమిటీ?

Written By:
  • S Reddy
  • , Updated On : January 7, 2025 / 09:24 AM IST

    Hansika

    Follow us on

    Hansika: చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక మోత్వానీ(Haniksa Motwani) పరిశ్రమలో అడుగుపెట్టింది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా తెరకెక్కిన దేశముదురు చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటించింది. దేశముదురు సూపర్ హిట్ కావడంతో హన్సికకు ఆఫర్స్ మొదలయ్యాయి. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఆమె నటించారు. సడన్ గా ఆమె టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. అక్కడ హన్సిక స్టార్డం అనుభవించడం విశేషం.

    కోలీవుడ్ కి వెళ్ళాక తెలుగులో అడపాదడపా చిత్రాలు చేసింది. ఫుల్ టైం మాత్రం తమిళ చిత్రాలకే కేటాయించింది. ఈ క్రమంలో హీరో శింబుతో ఎఫైర్ నడిపింది. వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో మునిగి తేలారు. కొన్నాళ్ళు రహస్యంగా వీరి ప్రేమాయణం సాగింది. దాదాపు పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అనుకున్నారు. అనూహ్యంగా బ్రేకప్ అయ్యారు. శింబుతో లవ్ ఎఫైర్ పై ఒకటి రెండు సందర్భాల్లో హన్సిక స్పందించింది. పేరు చెప్పకుండా ఆ ప్రస్తావన తెచ్చింది. శింబుని ప్రేమించిన విషయం నిజమే. కొన్ని కారణాలతో విడిపోయామని వెల్లడించారు.

    కాగా హన్సిక 2022 డిసెంబర్ నెలలో సోహైల్ కతూరియా అనే బిజినెస్ మెన్ ని వివాహం చేసుకుంది. సోహైల్ కి ఇది రెండో వివాహం. ముస్లిం ని వివాహం చేసుకున్నందుకు హన్సిక సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంది. ఆమెను పలువురు తప్పుబట్టారు. ప్రస్తుతం హన్సిక కెరీర్ మెల్లగా సాగుతుంది. కాగా హన్సిక కుటుంబంలో చిచ్చు రాజేసుకుంది. ఆమె తమ్ముడు భార్య కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది.

    హన్సిక తమ్ముడు పేరు ప్రశాంత్ మోత్వానీ. ఈయన ముస్కాన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. అందుకు కారణం ప్రశాంత్ తల్లి, హన్సికనే కారణం అంటుంది ముస్కాన్. ఈ మేరకు డిసెంబర్ 18న ప్రశాంత్ తల్లి మోనా మోత్వానీ, అక్క హన్సిక మోత్వానీలపై ముస్కాన్ కేసు పెట్టింది. వీరిద్దరి ప్రమేయం వలన తన భర్తతో గొడవలు జరుగుతున్నాయి. తమ కాపురంలో హన్సికతో పాటు ఆమె తల్లి చిచ్చు పెడుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ముస్కాన్ ఫిర్యాదు నేపథ్యంలో హన్సిక, మోనా కలిసి ఇంటి కోడలిపై గృహహింసకు పాల్పడుతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు హన్సిక నటిస్తున్న నాలుగు తమిళ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. గార్డియన్ పేరుతో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ లో హన్సిక ప్రధాన పాత్ర చేస్తుంది. ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది.