https://oktelugu.com/

Hansika: హీరోయిన్ హన్సికను లైన్లో పెట్టే పనిలో హైపర్ ఆది… వచ్చీ రావడం తోనే మొదలెట్టేశాడుగా!

Hansika: ఇక ఎప్పటిలానే శేఖర్ మాస్టర్(Sekhar Master), గణేష్ మాస్టర్ జడ్జిలుగా ఉన్నారు. కొత్తగా హీరోయిన్ హన్సిక ఈ సీజన్ కి జడ్జి గా మారింది.

Written By: , Updated On : June 4, 2024 / 01:00 PM IST
Hansika and Hyper Aadi fun in Dhee Celebrity Special-2 show

Hansika and Hyper Aadi fun in Dhee Celebrity Special-2 show

Follow us on

Hansika: దశాబ్దానికి పైగా ఢీ షో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. బుల్లితెర పై బెస్ట్ డాన్స్ షో గా ఢీ(Dhee) నిలిచింది. ఇప్పటికే 17 సీజన్లు కంప్లీట్ చేసుకుంది.ఇటీవల ఢీ సెలెబ్రెటీ స్పెషల్ షో ముగిసింది. ఈ క్రమంలో సీజన్ 2 ను తాజాగా లాంచ్ చేశారు. ఇక ఢీ సెలెబ్రెటీ స్పెషల్ 2 లేటెస్ట్ ప్రోమో విడుదల అయింది. లేటెస్ట్ సీజన్లో కూడా యాంకర్ ప్రదీప్(Anchor Pradeep) కనిపించడం లేదు. హీరోగా ఓ చిత్రం చేసేందుకు సిద్ధం అవుతున్న ప్రదీప్ యాంకరింగ్ నుండి గ్యాప్ తీసుకున్నాడని సమాచారం. నటుడు నందు(Nandu) సీజన్ 2 కి సైతం యాంకర్ గా కొనసాగుతున్నారు.

ఇక ఎప్పటిలానే శేఖర్ మాస్టర్(Sekhar Master), గణేష్ మాస్టర్ జడ్జిలుగా ఉన్నారు. కొత్తగా హీరోయిన్ హన్సిక ఈ సీజన్ కి జడ్జి గా మారింది. షోలో ఎంట్రీ ఇస్తూనే మంచి డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. పలు సీజన్స్ నుండి హైపర్ ఆది(Hyper Aadi) ఢీ లో మెంటర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. షోలో తనదైన కామెడీతో ఎంటర్టైన్ చేస్తుంటాడు. జడ్జెస్ ని కూడా ఆది వదలడు. తన మార్కు పంచులతో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. జడ్జెస్ గా ఉన్న హీరోయిన్స్ తో హైపర్ ఆది పులిహోర కలపడం మాత్రం కామన్.

Also Read: Indraja: జబర్దస్త్ షో నుంచి ఇంద్రజ అవుట్.. కారణం ఆమె

ఇక హన్సిక రాగానే ఆమె వెంట పడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ పై ఆది పంచులు వేసి నవ్వించాడు. కంటెస్టెంట్ శ్రియ రాణి రెడ్డి పర్ఫామెన్స్ చూసి శేఖర్ మాస్టర్ ఫిదా అయ్యాడు. ఈ క్రమంలో శ్రియ రాణి శేఖర్ మాస్టర్ కి తన రీల్స్ చూపించింది. ఇక హైపర్ ఆది దాన్ని హైలెట్ చేస్తూ .. అయ్యా నాకు ఒక డౌట్ అయ్యా అంటూ మొదలెట్టాడు. ఏంటి చెప్పయ్యా అని శేఖర్ మాస్టర్ అడిగాడు.

Also Read: Jabardasth – Dhee : జబర్దస్త్-ఢీ షోలలో భారీ మార్పులు… ఇవి మీరు గమనించారా?

ఆ అమ్మాయి రీల్స్ చూపించడానికి వచ్చి నప్పుడు .. మీ నెంబర్ ఏమైనా ఇచ్చారా అయ్యా అంటూ సెటైర్లు వేశాడు. ఆ తర్వాత సీరియల్ నటుడు మధు బాబు తన కూతురికి పేరు పెట్టాలంటూ హన్సికను కోరాడు. ఆమె అంటే చిన్నప్పటి నుంచి క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఆమె ఆ చిన్నారికి పేరు పెట్టి ఎమోషనల్ అయ్యారు. అనంతరం డాన్సర్ పండు, చిట్టి మాస్టర్ సందడి చేశారు. కాగా ఇకపై ఢీ షో బుధ, గురువారం… రెండు రోజులు ప్రసారం కానుంది.

Dhee Celebrity Special-2 Latest Promo|6th June 2024|Thursday @9:30pm| Sekhar Master, Hansika Motwani