https://oktelugu.com/

Indraja: జబర్దస్త్ షో నుంచి ఇంద్రజ అవుట్.. కారణం ఆమె

జబర్దస్త్ కు తోడుగా ఎక్స్ట్రా జబర్దస్త్ సైతం తెరపైకి తెచ్చారు. అయితే అనూహ్యంగా ఈ షో నుంచి నాగబాబు తప్పుకున్నారు. రోజా తన భుజస్కందాలపై నడిపారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 4, 2024 / 11:53 AM IST

    Indraja

    Follow us on

    Indraja: బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో మంచి గుర్తింపు సాధించింది. చాలామందికి ప్లాట్ ఫాంగా మారింది. ఔత్సాహిక నటీనటులకు ఇదో మంచి వేదికగా మారింది. తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా గుర్తింపు సాధించింది. అయితే కార్యక్రమానికి గుర్తింపు వెనుక జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా పాత్ర ఉంది. వేణు, రాఘవ, చంద్ర, శ్రీను.. ఇలా మొదలైన వీరి పేర్లు ఇప్పుడు స్టార్ కమెడియన్స్ గా మారాయి. జబర్దస్త్ షోలో సైతం చాలా మార్పులు సంభవించాయి.

    జబర్దస్త్ కు తోడుగా ఎక్స్ట్రా జబర్దస్త్ సైతం తెరపైకి తెచ్చారు. అయితే అనూహ్యంగా ఈ షో నుంచి నాగబాబు తప్పుకున్నారు. రోజా తన భుజస్కందాలపై నడిపారు. అయితే జబర్దస్త్ షోకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఇటువంటి తరుణంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ తెరపైకి వచ్చారు. జడ్జిగా మారి షోను బాగానే నడిపించారు. అయితే ఇటీవల ఆమె జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజులపాటు విరామం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఆమె నిర్ణయం వెనుక పెద్ద కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

    మంత్రి అయ్యాక రోజా జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లారు. ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు షో లోనే కొనసాగారు. అయితే ఇప్పుడు ఆమె కోసమే ఇంద్రజ జబర్దస్త్ షోను ఖాళీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందే రోజా ఓడిపోతారని వార్తలు వచ్చాయి. పోలింగ్ నాడే ఆమె ఓటమికి సాకులు వెతుక్కున్నారు. అయితే జబర్దస్త్ షో మరోసారి.. జనాదరణ పొందాలంటే రోజా అవసరం ఉందని.. మల్లెమాల సంస్థ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం రోజా తిరిగి షోలో చేరతారని.. అందుకే ఇంద్రజతో ఖాళీ చేయించారని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.