Guntur Karam: గుంటూరు కారం మూవీకి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి సానుకూల నిర్ణయాలు వెలువడ్డాయి. టికెట్స్ ధరల పెంపునకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. గుంటూరు కారం మూవీ దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ క్రమంలో టికెట్స్ రేట్లు పెంచుకుని అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను గుంటూరు కారం నిర్మాతలు అభ్యర్ధించారు. గుంటూరు కారం నిర్మాతల ప్రతిపాదనకు ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి.
తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రూ. 65 రూపాయలు, మల్టీఫ్లెక్స్ లలో రూ. 100 అదనంగా టికెట్స్ రేట్లు నిర్ణయించారు. ఇప్పటికే నిర్ణయించిన ధరలకు అదనంగా ఈ మొత్తం ప్రేక్షకులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా గుంటూరు కారం టికెట్స్ ధరలు పెంపునకు అనుమతులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ. 50 రూపాయలు అదనంగా టికెట్స్ రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వడమైంది. థియేటర్ తో సంబంధం లేకుండా ఏపీలో నిర్ణయించిన టికెట్ రేట్ల మీద అదనంగా యాభై రూపాయలు పెంచి విక్రయించనున్నారు. ఇది గుంటూరు కారం వసూళ్లకు అనుకూలించే అంశం. తెలంగాణలో అయితే అర్ధరాత్రి స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ దక్కింది. జనవరి 11 అర్థరాత్రి నుండే గుంటూరు కారం షోలు ప్రదర్శించనున్నారు.
గుంటూరు కారం చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం మూవీలో రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లి పాత్ర చేయడం విశేషం. ప్రకాష్ రాజ్ మరో కీలక రోల్ చేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.