Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఆ సందడి వేరే లెవల్ లో ఉంటుంది. అభిమానుల ఎదురుచూపులు కూడా మామూలుగా ఉండవు. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్లాల్సిందే అన్నట్టుగా బిహేవ్ చేస్తారు మిల్క్ స్టార్ ఫ్యాన్స్. ఈ మధ్య కొన్ని హిట్ లు మరికొన్ని ఫ్లాప్ లు అన్నట్టుగా నడుస్తుంది మహేష్ కెరీర్. ఇదిలా ఉంటే ఇప్పుడు గుంటూరు కారం సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అని తెలియగానే ఫుల్ ఖుషీ అయ్యారు అభిమానులు. అంతే కాదు సినిమా పై ఫుల్ హోప్స్ పెంచేసుకున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ లీక్ అయింది.
మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలోనే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ గా మారాయి. తమన్ సినిమా నుంచి ఔట్, ఈ హీరోయిన్ ఔట్ అంటూ ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పుకార్లకు పులిస్టాప్ పెట్టి తమన్ సంగీతం అందిస్తే.. శ్రీలీల, మీనాక్షి హీరోయిన్ లు గా నటిస్తున్నారు.
ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కీలక రోల్స్ లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, సునీల్, అలీ, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం సినిమా గుంటూరు నగరం గురించి అని టాక్.
గుంటూరులో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను బట్టబయలు చేసేందుకు ఒక లేడీ జర్నలిస్టు పని చేస్తుందట. మరి ఈ జర్నలిస్టుతో అదే నగరంలో ఉంటున్న యువకుడు ప్రేమలో పెడతారట. ఆ తర్వాత ఆ యువకుడు విలన్స్ నుంచి ఆ జర్నలిస్టును ఎలా కాపాడాడు. విలన్స్ కు ఎలా ఎదురు తిరిగాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. సూపర్ స్టార్ చాలా ఏళ్ల తర్వాత మాస్ అండ్ పవర్ఫుల్ రోల్ లో నటిస్తుండగా త్రివిక్రమ్ ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధం చేస్తున్నాడు.
అయితే అక్రమాలు చేయడం విలన్ ల పని, జర్నలిస్టులు, పోలీసులు వెతకడం కామన్. ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇందులో కొత్త ధనం ఏంటి అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. త్రివిక్రమ్ ఇదే స్టోరీతో వస్తే చాలా కొత్తధనాన్ని చూపిస్తే గానీ సినిమా హిట్ అవదు. లేదంటే నార్మల్ స్టోరీ అని లైట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఈ సినిమాలో ఉంది మహేష్, శ్రీలీల కాబట్టి కచ్చితంగా సినిమా హిట్ అందుకుంటుంది అని కొందరి టాక్. చూడాలి లీక్ అయినా స్టోరీ లైన్ నిజమా? కాదా అనేది..