Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ ఏ టైం లో గుంటూరు కారం మొదలుపెట్టాడో అన్నీ అవాంతరాలే. అసలు అనుకున్నట్లు ప్రాజెక్ట్ సాగడం లేదు. ఒక్కొక్కరిగా సినిమా నుండి తప్పుకుంటున్నారు. పూజా హెగ్డే ఫస్ట్ వికెట్. ఆమెకు వరుస ప్లాప్స్ పడుతుండగా మెయిన్ లీడ్ నుండి సెకండ్ లీడ్ కి డిమోట్ చేశారు. దాంతో ఆమె అలిగి వెళ్ళిపోయింది. శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేశారు. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అలాగే సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ బయటకు వెళ్లిపోయారు.
త్రివిక్రమ్ తో తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ ఇందుకు కారణం అంటున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కూడా గుంటూరు కారం టీమ్ కి గుడ్ బై చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. అటు మహేష్ వెకేషన్స్ లో బిజీ. ఇలా ప్రాజెక్ట్ అటకెక్కింది. కొన్నాళ్ళు నటుల కాల్షీట్స్ దొరక్క షూటింగ్ ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు తిరిగి షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. నేటి నుండి హైదరాబాద్ లో గుంటూరు కారం లేటెస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టారట.
దీని కోసం రూ. 4 కోట్లతో భారీ సెట్ ఏర్పాటు చేశారట. అక్కడే షూటింగ్ జరుగుతుందట. ఇక సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ స్థానంలో మనోజ్ పరమహంసను తీసుకున్నారట. ఈయనకు భారీ చిత్రాలకు పని చేసిన అనుభవం ఉంది. మనోజ్ పరమహంస గుంటూరు కారం టీమ్ కి ప్లస్ అంటున్నారు. ఇక గుంటూరు కారం 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అనుకున్న ప్రకారం విడుదలయ్యే అవకాశం లేదంటున్నారు.
షూటింగ్ ఆలస్యం కాగా గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందా అనే సందేహాలు కలిగాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ గుంటూరు కారం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం ప్రోమోలు, ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ మహేష్ దర్శకుడు రాజమౌళితో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.