Guntur Karam Pre Release Business: టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయిక లో గతం లో వచ్చిన ‘అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ పరంగా పెద్దగా విజయాలు సాధించలేదు. కానీ ఆ సినిమాలు టీవీ లో వేసినప్పుడు మాత్రం ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్ని సార్లు టీవీ లో టెలికాస్ట్ చేసిన కళ్ళు చెదిరే టీఆర్ఫీ రేటింగ్స్ దక్కేవి.
అందుకే ఈ కాంబినేషన్ కి అంత క్రేజ్. ప్రస్తుతం ఈ కాంబినేషన్ నుండి ‘గుంటూరు కారం’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి కేవలం పది శాతం షూటింగ్ మాత్రమే జరిగింది. ఎప్పుడో సంక్రాంతికి విడుదల అయ్యే ఈ సినిమా కి ఒక్క కృష్ణ జిల్లా మినహా , అన్నీ ప్రాంతాలలో బిజినెస్ క్లోజ్ అయ్యిందట. ఒక్కసారి ఆ వివరాలేంటో చూద్దాం.
ఈ చిత్రం కేవలం ఆంధ్ర ప్రాంతం బిజినెస్ దాదాపుగా 60 కోట్ల రూపాయిలకు పైగా జరిగిందని సమాచారం. ఇందులో కృష్ణ జిల్లాకి సంబంధించిన బిజినెస్ ఇంకా చర్చల్లోనే ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతం కి సంబంధించి 16 కోట్ల రూపాయిల బిజినెస్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 42 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టాక్.
అలా మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలకు కలిపి 128 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఆ తర్వాత ఓవర్సీస్ మరియు కర్నటక ప్రాంతాలకు కలిపి ఓవరాల్ గా ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 160 కోట్ల రూపాయిలకు జరిగిందని టాక్, కేవలం 10 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి ఈ స్థాయి బిజినెస్ జరగడం అంటే, జనాల్లో ఈ సినేమకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.