T20 World Cup 2024: టి 20 వరల్డ్ కప్ 2024లో తెలుగోడికి నో ఛాన్స్..బరిలోకి దిగే తుది జట్టు ఇదే…

టి20 వరల్డ్ కప్ లో గెలిచిన ఇండియన్ టీం అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టి20 వరల్డ్ కప్ ని సాధించలేకపోయింది. చాలాసార్లు ఫైనల్ కీ సెమీఫైనల్ దాకా చేరుకున్న ఇండియన్ టీం నాకౌట్ దశలో మాత్రం చేతులు ఎత్తేస్తుంది.

Written By: Gopi, Updated On : January 17, 2024 10:05 am

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: ప్రస్తుతం అన్ని దేశాల టీమ్ లు కూడా టి20 వరల్డ్ కప్ ని సాధించడానికి పూర్తిస్థాయిలో సన్నాహాలను చేస్తుంది. ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యే ఈ వరల్డ్ కప్ లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇక ఈ కప్ లో ఇండియన్ టీం ఎలాగైనా సరే గెలిచి తన సత్తా చూపించుకోవాలని చూస్తుంది. ఎందుకంటే 2007లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో గెలిచిన ఇండియన్ టీం అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టి20 వరల్డ్ కప్ ని సాధించలేకపోయింది. చాలాసార్లు ఫైనల్ కీ సెమీఫైనల్ దాకా చేరుకున్న ఇండియన్ టీం నాకౌట్ దశలో మాత్రం చేతులు ఎత్తేస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఎలాగైనా సరే కప్పు గెలిచి చూపించాలనే దృఢ సంకల్పంతో ఇండియన్ టీమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ దాకా చేరుకొని ఆస్ట్రేలియా తో ఆడిన ఫైనల్ మ్యాచ్ లో ఒక్క అడుగు దూరంలో ఓడిపోయి వరల్డ్ కప్ ను మిస్ చేసుకుంది. ఇక ఇప్పుడు మాత్రం ఈ కప్పును మిస్ చేసుకునే ఛాన్సే లేదు అంటూ దృఢ సంకల్పంతో ముందు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికోసం బీసిసిఐ రీసెంట్ గా టి20 వరల్డ్ కప్ కి ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి అనే చర్చలను సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సీనియర్ ప్లేయర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆఫ్ఘనిస్తాన్ తో ఆడుతున్న సిరీస్ కి రీ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి వీళ్లు కూడా టి20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే టి20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం బరిలోకి దిగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఓపెనర్లు గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎక్స్ ట్రా ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ టీం లో ఉంటాడు.

విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ కూడా టీమ్ లో ఉండే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక వీళ్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో అదరగొడుతున్న శివమ్ దూబే కూడా టీమ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర పటేల్ లాంటివారు టీంలో కొనసాగుతారు.ఇక వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఐపిఎల్ లో తన సత్తా చాటుకుంటే టీమ్ లో ఉంటాడు లేకపోతే అతని ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అర్షదీప్ సింగ్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఇండియన్ టీం లో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తానికి తెలుగు తేజం అయిన తిలక్ వర్మ కి టీమ్ లో అవకాశం వచ్చే ఛాన్స్ లేనట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే అంచనా ప్రకారం వీళ్ళు మాత్రమే టీమ్ లోకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.కానీ ఐపీఎల్ లో మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చినటైతే మిగితా కొంత మంది.ప్లేయర్లు కూడా టీమ్ లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి…

అంచనా ప్రకారం టి 20 వరల్డ్ కప్ లో ఆడే టీమ్ ను చూసుకుంటే…

రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ , రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే,రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ లాంటి ప్లేయర్లు ఇండియన్ తరుపున టీం టి20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.