Guntur Kaaram OTT
Guntur Kaaram OTT: మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం థియేటర్స్ లో సందడి చేస్తుంది. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం చిత్రాన్ని జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. గుంటూరు కారం చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఓపెనింగ్స్ లో మూవీ జోరు చూపించింది. గుంటూరు కారం టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ మార్కెట్ కింగ్ అయిన మహేష్ బాబు యూఎస్ లో ప్రీమియర్స్ తోనే $1.2 మిలియన్ వసూళ్లు దాటేశాడు.
గుంటూరు కారం ఓపెనింగ్ డే ఫిగర్ కెరీర్ హైయెస్ట్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. కాగా గుంటూరు కారం మూవీ ఓటీటీ డిటైల్స్ అందుతున్నాయి. గుంటూరు కారం డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి దక్కించుకుంది. కాబట్టి గుంటూరు కారం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
ఇక ఒప్పందం ప్రకారం ఏ సినిమా అయినా నాలుగు వారాల అనంతరం ఓటీటీలో విడుదల చేస్తారు. ఆ లెక్కన గుంటూరు కారం మూవీ ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో అందుబాటులోకి వస్తుంది. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్స్ గుంటూరు కారం చిత్రాన్ని ఫ్రీగా ఎంజాయ్ చేయవచ్చు. మన ఇంట్లో కూర్చుని నచ్చిన సీన్, సాంగ్ రిపీట్ చేస్తూ హ్యాపీగా చూడవచ్చు. .
దర్శకుడు త్రివిక్రమ్ గుంటూరు కారం చిత్రాన్ని మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. మదర్ సెంటిమెంట్ అనేది ప్రధానంగా సాగనుంది. తల్లి చేత తిరస్కరించబడిన కొడుకుగా మహేష్ కనిపించారు. మహేష్ మేనరిజం, ఎనర్జీ, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్ కీలక రోల్స్ చేశారు.